Paris Olympics 2024: మరి కొద్ది రోజుల్లో పారిస్ వేదికగా ఒలంపిక్స్ జరగనున్నాయి. వీటికోసం ఆయా దేశాల క్రీడాకారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫ్రాన్స్ దేశం కూడా అత్యాధునిక సౌకర్యాలతో మైదానాలు నిర్మించింది. అయితే ఈసారి కొత్తగా పడక సుఖాన్ని దూరం చేసే పడకలను కూడా సిద్ధం చేసింది. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికీ నిజం.
పడక సుఖాన్ని దూరం చేసే బెడ్లను ఏర్పాటు చేయడం వెనుక పారిస్ ఒలంపిక్ కమిటీ ఉద్దేశం వేరే ఉంది. అయితే ఈ పడకలను ఏర్పాటు చేయడం ఇది తొలిసారి కాదు. 2020 టోక్యోలో నిర్వహించిన ఒలంపిక్స్ లో కూడా వీటిని ఉపయోగించారు. త్వరలో జరిగే పారిస్ ఒలంపిక్స్ లో కూడా వీటిని వినియోగించనున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో పడక సుఖాన్ని దూరం చేసే ఈ పడకల గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది.
జపాన్ దేశానికి చెందిన ఎయిర్ వేవ్ అనే కంపెనీ ఈ పడకలను తయారు చేస్తోంది. సుమారు 16 వేల పడకలను పారిస్ ఒలంపిక్స్ కోసం ఈ సంస్థ తయారు చేసింది. ఈ పడకలను కార్ట్ బోర్డు తో తయారు చేశారు. ట్విన్స్ సైజ్డ్ బెడ్ ను పాలిథి లైన్ తో రూపొందించారు. వీటిని కార్ట్ బోర్డు ఫ్రేమ్ మీద ప్లేస్ చేశారు. అయితే ఈ పడక మీద ఎంతటి వ్యక్తి అయినా పడుకోవచ్చు. అయితే ఇద్దరు పడుకునేందుకు మాత్రం అవకాశం ఉండదు. అది సాధ్యం కూడా కాదు. ఆ వ్యక్తుల బరువును ఈ పడకలు మోయలేవు. అందుకే వీటిని పడక సుఖాన్ని దూరం చేసే పడకలు అనే పేరు వచ్చింది. 2020లో టోక్యో ఒలంపిక్స్ సమయంలో క్రీడాకారులు ఆ పడకల వల్ల శృంగారానికి దూరమయ్యారట. అప్పటినుంచే వీటికి పడక సుఖాన్ని దూరం చేసే పడకలు అనే పేరు వచ్చింది.
ఒలంపిక్స్ లో పోటీపడే క్రీడాకారులను శృంగార సంబంధ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని ఉద్దేశంతో ఈ పడకలను రూపొందించారు. ఒలంపిక్స్ జరుగుతున్నప్పుడు పర్యావరణానికి తీవ్రస్థాయిలో నష్టం ఏర్పడుతుంది. విపరీతమైన చెత్త పొగవుతుంది.. ఈ చెత్తను రీసైకిల్ చేయడం చాలా కష్టం. అందుకే ఇలాంటి పడకలను వినియోగిస్తున్నారని తెలుస్తోంది. పైగా ఈ పడకల వల్ల ఎన్నో లక్షల చెట్లను నరకాల్సిన అవసరం ఉండదట. పైగా కార్డు బోర్డ్స్ రీసైక్లింగ్ కి ఉపయోగపడతాయట. అందుకే ఈ పడకలను ఉపయోగిస్తున్నారట. అయితే ఈ పడకల వల్ల శృంగారం చేసుకునేందుకు అవకాశం ఉండదా? అంటే ఉంటుంది. అయితే ఒలంపిక్ నిర్వాహకులు స్వయంగా క*** సరఫరా చేస్తారు. 1988 సీయోల్ ఒలంపిక్స్ నుంచి క*** సరఫరా చేసే సంస్కృతికి బీజం పడింది. 2016లో ఏకంగా నాలుగు లక్షల 50వేల క*** ను ఒలంపిక్ నిర్వాహకులు సరఫరా చేశారు. అయితే క్రీడాకారుల కోసం ఈసారి కూడా అలాంటి ఏర్పాట్లు ఉంటాయట. అందుకోసం ప్రత్యేకమైన గదులు కూడా నిర్మించారని ప్రచారం జరుగుతోంది.