Nagpur Temperature
Nagpur Temperature: దేశ ఎండలతో మండుతోంది. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సంగతి తెలిసిందే. ఆ ఉష్ణోగ్రతను దాటి ఇప్పుడు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ శుక్రవారం(మే 31న) ప్రకటించింది. నాగపూర్‌లో భారత వాతావరణ విభాగం నాలుగు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఏర్పాటు చేసింది. ఇందులో రెండింటిలో గురువారం(మే 30న) అసాధారణ ఉష్ణోగ్రతలు చూపించాయి. సోనేగావ్‌లోని ఏడబ్ల్యూఎస్ స్టేషన్ లో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండీ కేంద్రంలో రికార్డు స్థాయిలో 56 డిగ్రీలు నమోదైంది. మిగతా రెండు స్టేషన్లలో 44 డిగ్రీల ఎండలు రికార్డయ్యాయి.
సెన్సార్స్ లోపంతో..
అయితే నాగపూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలపై ఐఎండీ స్పందించింది. సెన్సార్ లోపంతో రీడింగ్ నమోదులో పొరపాటు జరిగిందని ప్రకటించింది. వాస్తవానికి మే 30న నాగపూర్‌లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదైందని సమీపంలోని అగి AWS CICR తెలిపింది.ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC)కూడా ఇదే ధ్రువీకరించింది.
మొన్న ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి..
ఇక మూడు రోజుల క్రితం ఢిల్లీలో కూడా రికార్డు స్థాయిలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమదైనట్లు ఐఎండీ ప్రకటించింది. కానీ దీనిని కేంద్రం ఖండించింది. దీంతో ఐఎండీ మరోమారు పరిశీలించి సెన్సార్ లేదా లోకల్ ఫ్యాక్టర్‌లో లోపం కారణంగా ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకుందని ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు.
తప్పుడ నివేదికలో ఆందోళన..
ఇదిలా ఉంటే.. వరుసగా ఐఎండీ తప్పుడు రిపోర్టులు జనంలో ఆందోళన పెంచుతున్నాయి. గందరగోళానికి గురిచేసింది. తప్పుడు కార్మిక శాఖ నిబంధనల ప్రకారం ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటితే కంపెనీలు లేఆఫ్ ప్రకటించాలి. కార్మికులు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి. ఐఎండీ చెబుతున్న లెక్కలు ఇప్పుడు కంపెనీలను కూడా టెన్షన్ పెడుతున్నాయి. సెన్సార్ లోపాలతో తప్పుడు రిపోర్టు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పడిపోతున్న నీటి మట్టాలు..
ఇదిలా ఉండగా తీవ్రమైన ఎండలకు దేశంలోని జలాశయాల్లో నీటిమట్టాలు కూడా గణనీయంగా పడిపోతున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) గణాంకాల ప్రకారం దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్ల నీటిమట్టం 23 శాతానికి పడిపోయింది. మహారాష్ట్ర, గుజరాత్‌లలో ప్రస్తుత ప్రత్యక్ష నిల్వ 8.833 బిలియన్ క్యూబిక్ మీటర్లు (BCM) లేదా మొత్తం సామర్థ్యంలో 24 శాతం. ఇది గతేడాది 28 శాతంతో పోలిస్తే తగ్గుదల. అయితే సాధారణ నిల్వ 23 శాతం కంటే మెరుగుపడింది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Nagpur temperature is it really 56 degrees in nagpur what did the imd say
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com