Rajamouli: వర్మ మీద సంచలన కామెంట్లు చేసిన రాజమౌళి…వీడియో వైరల్

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన జేమ్స్ కెమరన్ లాంటి డైరెక్టర్ సైతం రాజమౌళిని మెచ్చుకొని త్రిబుల్ ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా రాజమౌళి తో కొద్దిసేపు మాట్లాడారు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

  • Written By: Gopi
  • Published On:
Rajamouli: వర్మ మీద సంచలన కామెంట్లు చేసిన రాజమౌళి…వీడియో వైరల్

Follow us on

Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో రాజమౌళి లాంటి డైరెక్టర్ ని మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అన్ని కూడా భారీ విజయాలను అందుకున్నాయి.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన బాహుబలి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాయి.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా తనదైన రీతిలో సూపర్ డూపర్ హిట్ అందుకుంది.

ఇక దాంతో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన జేమ్స్ కెమరన్ లాంటి డైరెక్టర్ సైతం రాజమౌళిని మెచ్చుకొని త్రిబుల్ ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా రాజమౌళి తో కొద్దిసేపు మాట్లాడారు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.దీనిని ఒక తెలుగు వాడు సాధించిన విజయంగా మనం చెప్పుకోవచ్చు.ఇక ఇలాంటి క్రమం లోనే అనిమల్ సినిమా ఫంక్షన్ కి వచ్చిన రాజమౌళి ఆ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించాడు. అనిమల్ సినిమా ట్రైలర్ అనేది చాలా బాగుంది ఎంటైర్ నా సినిమా కెరియర్ లో నేను ఇలాంటి ట్రెయిలర్ చూడలేదని, చిన్న చిన్న ఎమోషన్స్ ని కూడా పీక్ స్టేజ్ లో చూపించబోతున్నాడు సందీప్ అంటూ చాలా గొప్పగా చెప్పాడు. అలాగే ఇలాంటి ఒక డిఫికల్ట్ డైరెక్టర్ ని మనం 1989 సంవత్సరంలో వచ్చిన శివ సినిమా టైంలో రాంగోపాల్ వర్మ రూపం లో చూశాం… ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి రూపం పో చూస్తున్నాం…

ఆయన ఎప్పుడైతే ఇండస్ట్రీ కి వచ్చి శివ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేశాడో అప్పటినుంచి ఇప్పటివరకు అలాంటి డైరెక్టర్ ఎవరు రాలేదు.ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఇండస్ట్రీకి వచ్చి తను మరో రామ్ గోపాల్ వర్మ లా ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్నాడు అంటూ చెప్పాడు…ఇక ఈ విషయం మీద రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ ట్విట్టర్ లో రాజమౌళి మాట్లాడిన మాటల తాలూకు వీడియో ని షేర్ చేస్తూ రాంగోపాల్ వర్మ గురించి ఎవరు ఇప్పటివరకు ఇలా మాట్లాడలేదు అంటూ ఫన్నీ ఈమోజీ ని పెట్టీ పోస్ట్ చేశారు…

ఇక దాంతో చాలా సంవత్సరాల తర్వాత రాంగోపాల్ వర్మ పేరుని రాజమౌళి లాంటి ఒక పాన్ ఇండియా డైరెక్టర్ నోట్లో నుంచి వినడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమనే చెప్పాలి. ఇంకా ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ గురించి ఇండస్ట్రీ మాట్లాడు కుంటుంది అంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియా లో వైరల్ చేస్తూ ఆర్జీవీ అభిమానులు చాలా పండుగ చేసుకుంటున్నారు. రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా సందీప్ రెడ్డి వంగ గురించి అటు రాంగోపాల్ వర్మ గురించి గొప్పగా చెప్పడం చూసిన రాజమౌళి అభిమానులు కూడా అంత పెద్ద డైరెక్టర్ అయిన రాజమౌళి వర్మ గురించి అంత గొప్పగా మాట్లాడడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అని చెప్పాలి అంటూ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నారు…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు