Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల నట వారసులు ఎంట్రీ ఇచ్చి సినిమాలను చేస్తూ వాళ్ళు కూడా సక్సెస్ ఫుల్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి అభిమానులైతే ఉండేవారో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఈ వారసులు కూడా అలాంటి సినిమాలే చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కూడా అదే తరహాలో ముందుకు సాగుతున్నారు.
కెరియర్ మొదట్లో ఆయనకు చెప్పుకోదగ్గ సక్సెస్ లు అయితే రాలేదు. ఇక ‘ఒక్కడు ‘ సినిమా తర్వాత ఒక్కసారిగా ఆయన స్టార్టమనేది విపరీతంగా పెరిగింది. కానీ నైజాంలో మాత్రం ఆయనకి భారీ కలెక్షన్లైతే వచ్చేవి కాదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘పోకిరి ‘ సినిమా ఒక్కసారిగా మహేష్ బాబుని నైజాం లో స్టార్ హీరోని చేసింది. ఇక ఈ సినిమా నైజాం లో దాదాపు 17 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి మహేష్ బాబు ను స్టార్ హీరోను చేసింది. ఇక ఈ సినిమా దాదాపు 40 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.
అలాంటి ఒక మాస్ పాత్రలో మహేష్ బాబు ను చూసిన జనాలు ఈ సినిమాకి నీరాజనాలు పట్టారు. అలాగే మహేష్ అభిమానులైతే పండగ చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో ఆయన సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా మహేష్ బాబుకి నైజాంలో మంచి మార్కెట్ అయితే ఉంది.
ఎప్పటికప్పుడు తను ఆ మార్కెట్ ను కాపాడుకోవడానికి మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఆయన సూపర్ సక్సెస్ ని అందుకుంటే ఇక తనను బీట్ చేసే హీరో ఇండియాలో మరొకరు లేరు అనేంత లా పేరు సంపాదించుకుంటాడు…