Keerthy Suresh: వామ్మో కీర్తి సురేష్ డ్రైవింగ్ మామూలుగా లేదుగా.. కారును ఓ రేంజ్ లో తిప్పిందిగా.. వీడియో వైరల్

బోళా శంకర్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలి పాత్రలో మెరిసింది ఈ అమ్మడు. అయితే తమిళంలో పలు సినిమాలు కీర్తి చేతిలో ఉన్నాయట. ఇలా బిజీ అయినా కీర్తి తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది.

  • Written By: Neelambaram
  • Published On:
Keerthy Suresh: వామ్మో కీర్తి సురేష్ డ్రైవింగ్ మామూలుగా లేదుగా.. కారును ఓ రేంజ్ లో తిప్పిందిగా.. వీడియో వైరల్

Follow us on

Keerthy Suresh: కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ సాధించింది ఈ అమ్మడు. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా మారింది. ఇక అందం, అభినయం ఉన్నా కూడా తగిన ఆఫర్ రావడం లేదనే చెప్పాలి. దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను అందుకుంది ఈ అమ్మడు. మహానటి తర్వాత మరోసారి తన నటనతో ఫిదా చేసిన పాత్ర అంటే వెన్నల పాత్రనే అని చెప్పాలి.

బోళా శంకర్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలి పాత్రలో మెరిసింది ఈ అమ్మడు. అయితే తమిళంలో పలు సినిమాలు కీర్తి చేతిలో ఉన్నాయట. ఇలా బిజీ అయినా కీర్తి తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇందులో వెన్నల ఓ బీచ్ లో మహీంద్రా థార్ నడుపుతూ కనిపించింది. సినిమాల్లో హీరోలు చేసే ఛేజింగ్ సీన్స్ లో థార్ నడిపిస్తున్నట్టుగా బీచ్ ఇసుకలో థార్ ను సూపర్ హీరో రేంజ్ లా స్టైలీష్ గా నడిపింది. ఈ వీడియోను షేర్ చేసిన కీర్తి సురేశ్ ఆదివారం చెన్నై బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇలా కీర్తి స్టైలిష్ గా నడపడం చూసి ఆశ్యర్యపోతున్నారు నెటిజన్లు. అంతే కాదు కీర్తి నువ్వు సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

కీర్తికి డ్రైవింగ్ అంటే చాల ఇష్టమని గతంలోనే చాలా సార్లు చెప్పుకొచ్చింది. మనసు చలించి ఒత్తిడికి గురైనప్పుడు డ్రైవింగ్ కి వెళ్తుందట ఈ అమ్మడు. ఇదే విషయాన్ని గతంలో ఓ ఇంటర్య్వూలో కూడా చెప్పింది. పర్సనల్ లైఫ్ ను ఇలా ఎంజాయ్ చేస్తున్న మహానటి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరిగింది. అట్లీ దర్శకత్వంలో రీమేక్ చేయబోతున్న తేరీ సినిమాలో కీర్తి నటించబోతుందని టాక్.

 

View this post on Instagram

 

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు