Viral Video : అది ఓ పెద్ద సముద్రం. కనుచూపుమేర మొత్తం నీరే. ఆ సముద్రంపై ఓ బోటు ప్రయాణిస్తోంది. గాలికి వాలుగా సముద్రంలో నీరు కెరటాలుగా పొట్టెత్తుతోంది. తీరాన్ని తాకుతోంది. అయితే ఆ బోటు ప్రయాణిస్తుండగా అనుకోకుండా ఓ కుదుపు మొదలైంది. కళ్ళు మూసి తెరిచేలోపే ఆ బోటు తిరగబడింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోగా ఓ తిమింగలం సడన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇవ్వడమే కాదు.. సముద్రంలో అల్లకల్లోలాన్ని రేపింది. వాస్తవానికి ఆ తిమింగలం చేపల వేటకు వచ్చిందని అందరూ అనుకున్నారు. కానీ అది ఏకంగా బోటుపై దాడి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. ఆ వీడియో ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంది.. ఇప్పటికే ఈ వీడియో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది..
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం..
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం అమెరికాలోని న్యూ హంప్ షైర్ వద్ద ప్రోట్స్ మౌత్ హార్బర్ ఉంది. ఈ సముద్ర జలాల్లో 23 అడుగుల పొడవు ఉన్న ఓ బోటులో కొలిన్, వ్యాటీ యగీర్ ఉదయం చేపల వేటకు వెళ్లారు. వారి వలలకు భారీగానే చేపలు చిక్కాయి. చేపలు చిక్కాయనే ఆనందంలో వారంతా ఉత్సాహంగా తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా సముద్రంలో జరుగుతున్న పరిణామాలను వారు వీడియో తీస్తున్నారు. ఈ క్రమంలో ఓ తిమింగలం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. ఆ తర్వాత బోటు పై పడింది. తిమింగలం బరువుకు బోటు చిగురుటాగులాగా వణికి పోయి, సముద్రంలో మునిగిపోయింది. ఆ బోటులో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు నీటిలోకి దూకేయగా, మరొకరు సముద్రంలో పడిపోయారు.. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకుని వారిని ప్రాణాలతో రక్షించారు. అయితే ఈ ఘటనలో ఆ తిమింగలానికి ఎటువంటి గాయాలూ కాలేదు.
చాలా సహజం
న్యూ హంప్ షైర్ జలాల్లో భారీ తిమింగలాలు తరచుగా కనిపిస్తుంటాయి. ఇవి జూన్ నుంచి ఆగస్టు వరకు విపరీతంగా సంచరిస్తుంటాయి. బోటు పైకి దూకిన తిమింగలం ఆ ఘటనకు ముందు అక్కడే తచ్చాడింది. కొద్దిసేపు చేపలను వేటాడింది. ఉన్నట్టుండి బోటుపై పడింది. ఆ సమయంలో ఆ దృశ్యాన్ని చూస్తున్న వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వారిని తినేస్తుందేమోనని భయపడ్డారు. అయితే ఈ విషయాన్ని అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది డి సెంటర్ ఆఫ్ కోస్టల్ స్టడీస్ మెరైన్ యానిమల్ డిపార్ట్మెంట్ కు సమాచారం అందించారు. వారు హుటాహుటిన అక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. సాధారణ బోట్ల నిర్వాహకులు సముద్రంలోకి వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేశారు. “ప్రస్తుతం తిమింగలాల సంచారం ఎక్కువైంది. చేపల వేటకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి. సాధారణ బోట్లతో ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల వారంతా జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయమని” అమెరికన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కాలంలో తిమింగలాలు ప్రత్యుత్పత్తి జరుపుకునేందుకు సముద్రం పైకి వస్తాయట. ఈ సమయంలో సముద్రానికి చేపలు ఎదురు ఈదుతాయి కాబట్టి.. వాటిని వేటాడేందుకు కూడా బయటికి వస్తాయట. ఎదురు ఈదే చేపలు చాలా రుచిగా ఉంటాయట. వాటిని వేటాడేందుకు తిమింగలాలు ఎంత దూరమైనా ప్రయాణిస్తాయట. జూన్ జూలై నెలల్లో సముద్ర జలాలు నిశ్చలంగా ఉంటాయట. అందువల్లే తిమింగలాలు పైకి వచ్చి సరదాగా సయ్యాటలాడుతాయట. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంతవరకు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని అమెరికన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది హెచ్చరిస్తున్నారు.
Whale lands on boat pic.twitter.com/eIJPIsB8YO
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 24, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Whale attacked the boat turmoil in the sea video viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com