Vijay 68: చిరంజీవి, రవితేజ చేసిన తప్పే విజయ్ చేస్తున్నాడా..? ఒక్క సీన్ కోసం అన్ని కోట్లా..?

తమిళ్ ఇండస్ట్రీ లో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఏకైక తమిళ్ హీరో విజయ్… ఇక ఇలాంటి హీరో ప్రస్తుతం డిజాస్టర్ లను ఎదుర్కొంటున్నాడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో విజయ్ 68 పేరుమీద ఒక సినిమాని చేస్తున్నాడు.

  • Written By: Gopi
  • Published On:
Vijay 68: చిరంజీవి, రవితేజ చేసిన తప్పే విజయ్ చేస్తున్నాడా..? ఒక్క సీన్ కోసం అన్ని కోట్లా..?

Follow us on

Vijay 68: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన కొద్దిమంది నటులలో విజయ్ ఒకడు. ఈయన చేసిన సినిమాలు తమిళంలో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తాయి. తమిళ్ ఇండస్ట్రీ లో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఏకైక తమిళ్ హీరో విజయ్… ఇక ఇలాంటి హీరో ప్రస్తుతం డిజాస్టర్ లను ఎదుర్కొంటున్నాడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో విజయ్ 68 పేరుమీద ఒక సినిమాని చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా కోసం విజయ్ 19 ఏళ్ల యువకుడిగా నటించే కొన్ని సన్నివేశాలు ఉండటంతో దానికోసం హై టెక్నాలజీని వాడి విజయ్ 19 ఏళ్ల కుర్రాడు గా చేసే సీన్ లను చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తుంది.ఇక విధంగా గా సినిమా యూనిట్ దాని మీదనే వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే చిరంజీవి ఆచార్య సినిమాతో,రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో ఇలాంటి సాహసాలు చేశారు. కానీ అవి అంతగా వర్కౌట్ కాలేదు.ఇక ఇప్పుడు విజయ్ చేస్తున్న ఇదే సాహసం ఫెయిల్యూర్ గా మిగులుతుందా లేక సక్సెస్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ టెక్నాలజీ కోసం ప్రొడ్యూసర్ తో ఆరు కోట్ల రూపాయలను పెట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వెంకట్ ప్రభు ఈ సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇంతకుముందు వెంకట్ ప్రభు నాగచైతన్యతో కష్టడి అనే సినిమా చేసి ఒక భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఇప్పుడు ఆయన డైరెక్షన్ లోనే విజయ్ సినిమా చేస్తుండటం చూస్తున్న అభిమానులకి కొంత మేరకు అనుమానలైతే ఉన్నాయి.ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే బేస్డ్ గా నడిచే సినిమా అవడం వల్ల ఈ సినిమా మీద ఎక్కడో సగటు అభిమానికైతే కొంత హోప్స్ ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇంత డబ్బు పెట్టి అలాంటి ఒక టెక్నాలజీని వాడి ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే విజయ్ వరుసగా బీస్ట్ , వారసుడు, లియో లాంటి సినిమాలతో పెద్దగా తన ఇంపాక్ట్ ని అయితే చూపించలేకపోయాడు.

కాబట్టి తనకిప్పుడు ఖచ్చితంగా ఒక హిట్ పడాలి లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ అనేది మరింత డౌన్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే మిగతా హీరోల నుంచి ఎదురయ్య పోటీని కూడా తను తట్టుకొని నిలబడాలంటే పక్కాగా అయితే ఇప్పుడు ఆయన ఖాతాలో హిట్ పడాల్సి ఉంది. మరి వెంకట్ ప్రభు విజయ్ కి ఏ రేంజ్ లో హిట్ ఇస్తాడు అనేది తెలియాల్సి ఉంది…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు