Allu Arjun : పుష్ప 2 విడుదలకు ముందు రోజు డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ షోకి హీరోయిన్ రష్మికతో పాటు అల్లు అర్జున్ హాజరయ్యాడు. భారీగా అభిమానులు చేరుకున్న నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. భర్త తన ఇద్దరు పిల్లలతో సినిమాకు వచ్చిన మహిళ తొక్కిసలాటలో మృతి చెందింది. ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ సిబ్బంది, యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
కోర్టు అల్లు అర్జున్ కి రిమాండ్ విధించింది. అదే రోజు సాయంత్రానికి అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరైంది. అప్పటికే చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ ని తరలించారు. బెయిల్ పై విడుదల ప్రక్రియ ఆలస్యం కావడంతో జైలు నిబంధనల ప్రకారం అల్లు అర్జున్ ఒకరోజు రాత్రి చంచల్ గూడ జైలులో గడిపాడు. అయితే జైలులో అల్లు అర్జున్ బట్టలు విప్పించి, నగ్నంగా సెర్చ్ చేసి ఉంటారని, నటి కస్తూరి అంచనా వేస్తుంది. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి అరెస్ట్ అయ్యారు. ఆమె కూడా జైలు జీవితం గడిపారు.
Also Read ; నెల రోజుల పాటు అల్లు అర్జున్ స్పెషల్ ట్రైనింగ్..దేనికోసం ఇంత కష్టం? అయోమయంలో పడిన ఫ్యాన్స్!
జైల్లోకి వెళ్లే ముందు కంప్లీట్ స్ట్రిప్ సెర్చ్ జరుగుతుందని కస్తూరి అన్నారు. మొత్తం దుస్తులు తీసేది తల్లి కడుపులో నుండి ఎలా వస్తామో అలా నిల్చోవాలి. చివరికి ప్రైవేట్ పార్ట్స్ లో ఏమైనా వస్తువులు దాచామేమో అని చెక్ చేస్తారు. అల్లు అర్జున్ కి కూడా ఇదే జరిగి ఉంటుంది, అని ఆమె అన్నారు. నటి కస్తూరి కామెంట్స్ నేపథ్యంలో.. అల్లు అర్జున్ కి జైలులో ఇంత అవమానం జరిగిందా? అని అభిమానులు వాపోతున్నారు. అయితే జైలు నిబంధలను అనుసరించి ఇది ఎవరైనా చేయాలి. ప్రముఖులకు మినహాయింపు ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిజంగా అల్లు అర్జున్ నగ్నంగా చెక్ చేశారా లేదా? అనే విషయం ఎవరికీ తెలియదు.
ఇక పుష్ప 2తో అల్లు అర్జున్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. పుష్ప 2 ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సౌత్ కి మించి నార్త్ లో అతిపెద్ద విజయం నమోదు చేసింది. నెక్స్ట్ అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో మూవీ చేస్తున్నాడు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
Also Read : విదేశాల్లో అల్లు అర్జున్ ట్రైన్ అయ్యాడా? నెక్స్ట్ మూవీపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్