Anil Ravipudi : సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను తీసి సక్సెస్ ని సాధించడం అనేది చాలా పెద్ద టాస్క్… ఎందుకంటే ప్రతి సంవత్సరం 200 సినిమాలు రిలీజ్ అయితే అందులో దాదాపు 180 సినిమాలు కమర్షియల్ సినిమాలు గానే వస్తుంటాయి. వాటిని బీట్ చేస్తూ మన కథలో కొత్తదనాన్ని ఆడ్ చేస్తూ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే విధంగా ఒక సినిమాని ఎలా తీయాలి అనేది కొంతమందికి మాత్రమే తెలుసు… అందులో రావిపూడి సిద్ధహస్తుడు అనే చెప్పాలి. ఇప్పటివరకు ఇండస్ట్రీలో అతనికి ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. తను చేసిన తొమ్మిది సినిమాలతో సూపర్ హిట్లను సాధించాడు. స్టార్ హీరోలకు సైతం బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అవుతున్నాడు. ఈ సంవత్సరం ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో చిరంజీవిని సైతం 400 కోట్ల క్లబ్ లో చేర్చాడు. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… అనిల్ రావిపూడి సినిమాలో చాలామంది కామెడియన్స్ మనకు కనిపిస్తూనే ఉంటారు. తన ఫ్రెండ్స్ అయిన ఇద్దరు కమెడియన్స్ ను మాత్రం ఆయన ఇప్పటివరకు తన సినిమాలో పెద్దగా వాడుకోలేదు. అందులో మొదటి ప్లేస్ లో సప్తగిరి ఉండగా, రెండో ప్లేస్ లో అదిరే అభి ఉన్నాడు. అనిల్ రావిపూడి కి అదిరే అభి కి ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నుంచి చాలా పరిచయం ఉంది. కొన్ని సందర్భాల్లో అనిల్ రావిపూడి డైలాగ్స్ రాస్తున్నప్పుడు అతనికి తెలంగాణ స్లాంగ్ కి సంబంధించిన యాస లో మాటలు రాయడానికి సైతం అదిరే అభి హెల్ప్ చేస్తూ ఉండేవాడట.
కానీ అదిరే అభి నటుడిగా జబర్దస్త్ లో రాణిస్తున్నాడు. అలాగే ఇతరుల సినిమాల్లో కూడా చిన్న చిన్న వేషాలను వేస్తున్నాడు. అయినప్పటికి అనిల్ రావిపూడి సినిమాలో ఇప్పటివరకు ఒకసారి కూడా కనిపించింది లేదు. ఇక సప్తగిరి విషయమైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సప్తగిరి అనిల్ రావిపూడి ఇద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారు.
కానీ ఆయన సినిమాలో సప్తగిరికి సపరేట్ క్యారెక్టర్ అయితే డిజైన్ చేయలేదు. ఒకటి అర సినిమాల్లో చిన్న చితక పాత్రలో కనిపించినప్పటికి ఫుల్ లెంత్ కమెడీయన్ పాత్రలో అతన్ని చూపించలేదు. ఎందుకని అనిల్ రావిపూడి ఇలా చేస్తున్నాడు అంటూ అతని ఫ్యాన్స్ సైతం అతని గురించి కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి వాళ్ళ ఇమేజ్ కి తగ్గ క్యారెక్టర్ దొరికినప్పుడు వాళ్ళను తీసుకుంటాననే ఉద్దేశ్యంతోనే అనిల్ రావిపూడి ఉన్నారట. ఎంత ఫ్రెండ్స్ అయిన కూడా ఏదో ఒక చిన్న చితక పాత్రలో వాళ్ళని తీసుకోవడం వాళ్ళ ఇమేజ్ కి ఇబ్బంది అవుతుందని అందుకే తను ఆలోచిస్తున్నానని అనిల్ పలు సందర్భాల్లో క్లారిటి ఇచ్చాడు…