Champions Trophy 2025: ఓవైపు వికెట్ల పడిపోతున్నాయి.. మరోవైపు చేదించాల్సిన లక్ష్యం పెరిగిపోతోంది. తోడుగా ఉంటారనుకున్న సహచరులు వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. ఈ దశలో ఇంకో ఆటగాడితే వెన్ను చూపించేవాడు. కానీ అక్కడ ఉన్నది మిల్లర్.. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.. ఒకానొక దశలో దక్షిణాఫ్రికాకు గెలుస్తుందని ఆశలు కల్పించాడు.
న్యూజిలాండ్ జట్టుతో చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. కాకపోతే ఇక్కడ మిల్లర్ చేసిన పోరాటం మాత్రం సింహాన్ని గుర్తు చేసింది. సగటు క్రికెట్ అభిమాని మిల్లర్ ఆట చూసి పరవశించిపోయాడు. కొండంత లక్ష్యం ఉన్నప్పటికీ.. ఎదుర్కోవాల్సిన బంతులు తక్కువగానే ఉన్నప్పటికీ.. జట్టులో గెలుస్తామనే ఆశను కల్పించాడు మిల్లర్. ఫోర్లు, సిక్సర్లతో ఎదురు దాడికి దిగాడు. న్యూజిలాండ్ బౌలర్ల పై ఎటువంటి కనికరం చూపించకుండా దంచి కొట్టాడు. ముఖ్యంగా చివరి 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇంకో మూడు ఓవర్లు కనక మ్యాచ్ మిగిలి ఉంటే.. సహచరులు సహకరించి ఉంటే మిల్లర్ పోరాటం వృధా అయ్యేది కాదు. న్యూజిలాండ్ సెమీఫైనల్ లో గెలిచేది కాదు.
పోరాట సింహం
న్యూజిలాండ్ విధించిన 363 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించడంలో మొదట్లో కాస్త దక్షిణాఫ్రికా దూకుడు కొనసాగించినప్పటికీ.. ఆ తర్వాత చేతులెత్తేసింది. ఒత్తిడిలో కూరుకుపోయింది. కీలక ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ఈ క్రమంలో మిల్లర్ ఒకసారిగా పోరాట సింహాన్ని గుర్తు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లపై ఏమాత్రం కనికరం లేకుండా విరుచికుపడ్డాడు. 67 బంతుల్లో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిల్లర్ కు సహచర ఆటగాళ్లు కాస్త సహకరించి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. ముఖ్యంగా ఎన్ గిడి తో కలిసి మిల్లర్ 27 బంతుల్లో 56 పరుగులు చేయడం ఈ మ్యాచ్ కే హైలెట్. మిల్లర్ ను అవుట్ చేయడానికి న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి అతడే రంగంలోకి దిగినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఎటువంటి బంతులు వేసినా సాంట్నర్ భయపడలేదు. తన దూకుడును ఆపలేదు. బీభత్సమైన బ్యాటింగ్ తో పాకిస్తాన్ ను షేక్ చేశాడు. సెమి ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓడిపోయినప్పటికీ.. న్యూజిలాండ్ జట్టును దాదాపు ఓడించినంత పని చేశాడు మిల్లర్. అందువల్లే అతడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సనాలిటీగా కొనసాగుతున్నాడు. మిల్లర్ దూకుడుగా ఆడుతున్న సమయంలో.. ఇతర ఆటగాళ్లు చేతులెత్తేశారు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేసి అతడికి ఇద్దామనే సోయి కూడా వాళ్లలో లేకుండా పోయింది. ఒకవేళ క్లాసెన్ లాంటి ఆటగాడు మైదానంలో నిలబడి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. ఇతర ఆటగాళ్లు న్యూజిలాండ్ బౌలర్ల ముందు చేతులెత్తేయడంతో మిల్లర్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది.. ఇంకో మూడు ఓవర్లు గనుక ఉంటే మ్యాచ్ స్వరూపం కచ్చితంగా దక్షిణాఫ్రికాకు అనుకూలంగా ఉండేది.
Also Read: మాయాజాలం అంటాం కదా.. సాంట్నర్ బౌలింగ్ కూడా అలాంటిదే.. పాపం దక్షిణాఫ్రికా..