Homeఎంటర్టైన్మెంట్Suriya: మా నాన్న తో నన్ను పోల్చినప్పుడు అవమానం తట్టుకోలేకపోయాను - హీరో సూర్య

Suriya: మా నాన్న తో నన్ను పోల్చినప్పుడు అవమానం తట్టుకోలేకపోయాను – హీరో సూర్య

Suriya: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదురుకుంటూ వచ్చిన సూర్య , ఈ ఏడాది ‘కరుప్పు’ చిత్రం తో ఎలాంటి కం బ్యాక్ ఇచ్చాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 340 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. తెలుగు భాషలో కూడా ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇక్కడ ‘వీరభద్రుడు’ అనే టైటిల్ తో విడుదలైన […]

Suriya: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదురుకుంటూ వచ్చిన సూర్య , ఈ ఏడాది ‘కరుప్పు’ చిత్రం తో ఎలాంటి కం బ్యాక్ ఇచ్చాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 340 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. తెలుగు భాషలో కూడా ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇక్కడ ‘వీరభద్రుడు’ అనే టైటిల్ తో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత సూర్య నుండి విడుదల అవ్వబోతున్న చిత్రం ‘విశ్వనాధ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా , ఈ నెల 14 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళం , మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా సూర్య ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘ఒకసారి ఒక మంత్రి నన్ను చూసి అచ్చుగుద్దినట్టు మీ నాన్న శివకుమార్ లాగానే నటిస్తున్నావు కదా అని అన్నాడు. అది నన్ను చాలా తీవ్రంగా బాధించింది. ఆ రోజే నేను నా కెరీర్ విషయం లో బలమైన నిర్ణయం తీసుకున్నాను. ఇక పై నా తండ్రి చేసిన సినిమాలను చూడకూడదు అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఆయన సినిమాలు చూడడం మానేశాను. ఆయన నటన శైలి నాపై ఎలాంటి ప్రభావం చూపించకూడదు , నటుడిగా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఆ దిశగా కష్టపడడం మొదలుపెట్టాను’ అంటూ చెప్పుకొచ్చాడు సూర్య. ఆయన చెప్పిన మాటల్లో కూడా నిజం ఉంది , కానీ తండ్రి సినిమాలు చూడకుండా ఉండాలనే నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం.

అయినప్పటికీ ఇన్నాళ్లు ఆ కష్టాన్ని భరించి సూర్య బలంగా నిలబడడం అనేది సాధారణమైన విషయం కాదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఇక ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ విషయానికి వస్తే , ‘లక్కీ భాస్కర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం కావడం తో పాటు , సూర్య సూపర్ ఫార్మ్ లో ఉండడం తో ఈ సినిమాకు మార్కెట్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. గత పదేళ్లుగా ఏ సూర్య సినిమాకు జరగనంత బిజినెస్ ఈ చిత్రానికి జరిగింది. కేవలం పాజిటివ్ టాక్ రావడం ఒక్కటే బ్యాలన్స్, సూర్య ఖాతాలో మరో 300 కోట్ల గ్రాస్ సినిమా వచ్చి చేరినట్టే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper