Rambha Urvashi Menaka Teaser: ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమాలకు ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లరి నరేష్ సినిమా వస్తుందంటే చాలు , కళ్ళు మూసుకొని టికెట్స్ కొనేందుకు సిద్ధంగా ఉండేవారు ప్రేక్షకులు. అయితే మారిన ట్రెండ్ ప్రకారం ఆయన కామెడీ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి , కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. ఒకటి రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి కానీ , అత్యధిక శాతం సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. మార్కెట్ డేంజర్ లో పడడంతో మళ్లీ తన పాత ట్రాక్ లోకి అడుగుపెట్టాడు అల్లరి నరేష్. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రంభ ఊర్వశి మేనకా’. చంద్ర మోహన్ చింతాడా దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని , అక్కినేని నాగార్జున తన అన్నపూర్ణ బ్యానర్స్ పై నిర్మించాడు. హాస్య మూవీస్ కూడా నిర్మాణం లో భాగం పంచుకుంది.
సెప్టెంబర్ 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ఈ సినిమా విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేశారు. ఈ టీజర్ ఎలా ఉందో ఈ రివ్యూ లో చూసి తెలుసుకుందాం. గతం లో అల్లరి నరేష్ హీరో గా నటించిన ‘యముడికి మొగుడు’ సినిమా గుర్తుంది కదా, ఆ చిత్రాన్ని మరోసారి గుర్తు చేసేలా చేసింది ఈ చిత్రం. అందులో హీరో ఏది కోరితే అది జరిగే వరం ఉంటుంది. అలా ఆయన యముడి కూతురిని కోరుతాడు , ఆమె వెంటనే భూమి మీదకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది చాలా ఫన్నీ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాడు డైరెక్టర్. ఈ సినిమా స్టోరీ లైన్ కూడా ఇంచు మించు అలాగే ఉంది.
ఇందులో అల్లరి నరేష్ ఫ్యామిలీ కి ఒక మ్యాజిక్ బుక్ ఉంటుంది. ఈ బుక్ చక్రం మీద కరెక్ట్ గా ముగ్గు గీసి గట్టిగా కోరుకుంటే స్వర్గం లో ఉన్న రంభ , ఊర్వశి , మేనకలు దిగి వస్తారని హీరో తండ్రి చెప్తాడు. అప్పుడు నేను వాళ్ళని కోరిక కోరుతూ సినిమా హీరో అయిపోవచ్చా అని అడిగితే , రంభ దిగి ప్రత్యక్షమై అవకాశం ఇస్తే అయిపోతావు అని అంటాడు తండ్రి. ఆ తర్వాత హీరో కోరినట్టుగానే రంభ ఊర్వశి మేనికి భూమి మీదకు రావడం , ఆ తర్వాత వాళ్ళ కారణంగా క్రియేట్ అయ్యే ఫన్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. ఈ చిత్రం లో ఇంద్రుడిగా వెన్నెల కిశోరె నటించగా , రంభ గా విష్ణు ప్రియా, ఊర్వశి గా రాశి సింగ్ , మేనకగా ప్రిషా సింగ్ నటించింది. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా సురభి నటించింది. ఈ టీజర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.