Homeలైఫ్ స్టైల్Money Loss Recovery: డబ్బులు కోల్పోయారా..? తిరిగి సంపాదించుకునే చిట్కాలు ఇవే..

Money Loss Recovery: డబ్బులు కోల్పోయారా..? తిరిగి సంపాదించుకునే చిట్కాలు ఇవే..

Money Loss Recovery: వ్యాపారంలో నష్టం.. ఉద్యోగం పోవడం..అనుకోని వైద్య ఖర్చులు… వంటి కారణాలతో డబ్బులు కోల్పోవడం సాధారణంగా ఎదురయ్యే పరిస్థితియే. ఇలాంటి సమయంలో చాలామంది ‘ఇక మళ్లీ ఇంత డబ్బు సంపాదించలేను’ అని ఆందోళన చెందుతుంటారు. కానీ ఒకసారి డబ్బు పోతే జీవితమే ఆగిపోదు. గత నష్టాన్ని తలచుకుంటూ కుంగిపోవడం కంటే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టడం ముఖ్యం. ఇలాంటప్పుడు తిరిగి డబ్బులు సంపాదించాలంటే కొన్ని టిప్స్ […]

Money Loss Recovery: వ్యాపారంలో నష్టం.. ఉద్యోగం పోవడం..అనుకోని వైద్య ఖర్చులు… వంటి కారణాలతో డబ్బులు కోల్పోవడం సాధారణంగా ఎదురయ్యే పరిస్థితియే. ఇలాంటి సమయంలో చాలామంది ‘ఇక మళ్లీ ఇంత డబ్బు సంపాదించలేను’ అని ఆందోళన చెందుతుంటారు. కానీ ఒకసారి డబ్బు పోతే జీవితమే ఆగిపోదు. గత నష్టాన్ని తలచుకుంటూ కుంగిపోవడం కంటే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టడం ముఖ్యం. ఇలాంటప్పుడు తిరిగి డబ్బులు సంపాదించాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటంటే?

ఆర్థికంగా నష్టపోయిన సమయంలో ఒత్తిడి, నిరాశ నుంచి బయటపడేందుకు కొందరు మద్యం, పొగతాగడం, జూదం, బెట్టింగ్ వంటి అలవాట్ల వైపు వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇవి సమస్యను పరిష్కరించకపోగా.. చేతిలో ఉన్న డబ్బును కూడా క్రమంగా ఖాళీ చేస్తాయి. ముఖ్యంగా ఇప్పటికే నష్టపోయిన వ్యక్తి ఒక్కసారి గెలిస్తే మొత్తం డబ్బు తిరిగి వస్తుంది.. అనే ఆలోచనతో బెట్టింగ్ లేదా జూదంలో మరింత డబ్బు పెట్టడం పెద్ద ప్రమాదంగా మారుతుంది. కాబట్టి ఆర్థికంగా డబ్బును తినివేసే వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండటం.

డబ్బు నష్టం కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు.. మానసికంగా కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. గతంలో సంపాదించిన డబ్బంతా పోయిందని బాధపడటం సహజమే. కానీ ‘నేను ఇక డబ్బు సంపాదించలేను’ అనే ఆలోచనలు సమస్యను మరింత క్లిష్టం చేస్తాయి. ఒకసారి నష్టపోయినంత మాత్రాన వ్యక్తి సంపాదించే సామర్థ్యం కోల్పోయినట్లు కాదు. గతంలో సంపాదించడానికి ఉపయోగించిన నైపుణ్యాలు, అనుభవం, పరిచయాలు ఇప్పటికీ మీ వద్దే ఉంటాయి. కాబట్టి జరిగిన నష్టాన్ని ఒక అనుభవం గా తీసుకుని.. మళ్లీ మొదటి నుంచి నిర్మించుకునే ధైర్యం అవసరం.

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలామంది తమ పరిస్థితిని బయటకు చెప్పడానికి ఇష్టపడరు. ఇతరుల దగ్గర సహాయం అడగడం తమ స్థాయికి తక్కువగా భావిస్తారు. కొన్నిసార్లు ఇదే ఇగో మరింత నష్టానికి దారితీస్తుంది. అవసరమైతే కుటుంబ సభ్యులు, నమ్మకమైన స్నేహితులు లేదా ఆర్థిక నిపుణులతో మాట్లాడాలి. గతంలో చేసిన తప్పులను అంగీకరించి.. ఇకపై ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. ఇగోను కాపాడుకోవడం కంటే ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోవడం ముఖ్యం.

అప్పులు ఉన్నప్పుడు వాటిని చూసి భయపడటం సహజం. కానీ మొత్తం అప్పును ఒకేసారి తీర్చలేమని అనిపిస్తే.. ముందుగా అన్ని అప్పుల వివరాలను ఒక కాగితంపై రాసుకోవాలి. ఎంత అసలు బాకీ ఉంది? వడ్డీ ఎంత? నెలకు ఎంత చెల్లిస్తున్నాం? ఏ అప్పుపై వడ్డీ ఎక్కువగా ఉంది? అనే విషయాలను గుర్తించాలి. అధిక వడ్డీ ఉన్న అప్పులను ముందుగా తగ్గించేలా ప్రణాళిక వేసుకోవడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని క్రమంగా తగ్గించుకోవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper