Viswanath and Sons: ‘కరుప్పు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సూర్య హీరో గా నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ హిట్ తర్వాత సూర్య నుండి రాబోతున్న చిత్రం కావడం తో , అటు తమిళం లోనూ , ఇటు తెలుగు లోనూ ఈ చిత్రానికి క్రేజ్ విపరీతంగా ఉంది. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ రేంజ్ లోనే జరిగింది. ఇక రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి కూడా ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత వింటేజ్ సూర్య సినిమాని చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి.
అందులో భాగంగా సూర్య తో పాటు మూవీ టీం మొత్తం కలిసి లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో డైరెక్టర్ వెంకీ అట్లూరి షూటింగ్ సమయం లో తమకు ఎదురైన కొన్ని అనుభవాల గురించి చెప్పిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘మేము షూటింగ్ చేస్తున్న లొకేషన్ లో చిరుత పులి తిరుగుతూ ఉండేది. మేము ఆ లొకేషన్ కి వచ్చిన ముందు రోజే ఆ చిరుత పులి ఒక కుక్క ని చంపి తీసుకెళ్ళిపోయింది. మేము షూటింగ్ చేస్తున్న రోజు , చిరుత పులి మా సెట్స్ లోకి వచ్చిందట. కానీ అది తిరిగి వెళ్లడం మాత్రం ఎవ్వరూ చూడలేదు. దీంతో ఒక్కసారిగా అందరూ భయపడిపోయి చిరుత పులి వచ్చింది అంటూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు. నేను ఏమి రాలేదు అయ్యా , కుక్క ని చూసి మీరు ఏదేదో అనుకుంటున్నారు అన్నాను’.
‘కట్ చేస్తే నా ముందు నుండే ఆ చిరుత పులి వెళ్ళింది. కేవలం గంటన్నర షూటింగ్ జరిగితే చాలు , అయిపోతుంది. అయితే చిరుత పులి ఉందనే విషయం చెప్తే అందరూ ఎక్కడ భయపడి పోయి లొకేషన్ నుండి పారిపోతారేమో అని , ఆ విషయం చెప్పకుండానే షూటింగ్ పూర్తి చేసాను. తిరిగి వెళ్ళేటప్పుడు , అందరూ గుంపుగా కలిసి వెళ్ళండి , చిరుత పులి ఉంది ఇక్కడ అని చెప్పాను. అలా 140 మంది ప్రాణాలను రిస్క్ లో పెట్టి ఆ షూటింగ్ పార్ట్ ని పూర్తి చేశాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు వెంకీ అట్లూరి. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.