Venkatesh: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ తమ సత్తా చాటుకున్న నటులు చాలా మంది ఉన్నారు. ఇతర భాషల నుంచి ఎదురయ్యే పోటీని సైతం తట్టుకోవడం మన ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్లడంలో కొంతమంది హీరోలు చాలావరకు హెల్ప్ చేశారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి నటులు సైతం యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళ వంతు కృషి చేశారు. ఇక ఇలాంటి క్రమంలోనే విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫూల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో పెను సంచలనాలను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన ఎలాగైనా సరే భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఇలాంటి క్రమంలోనే నేను లోకల్ సినిమాతో మంచి గుర్తింపుని సంపాదించుకున్న దర్శకుడు త్రినాధరావు నక్కిన సైతం వెంకటేష్ తో సినిమాను చేయడానికి ఒక సబ్జెక్టుని రెడీ చేసుకున్నాడు.
ప్రసన్నకుమార్ బెజవాడ రాసిన కథకి వెంకటేష్ సైతం చాలా ఎగ్జైట్ అయ్యారట. వీళ్ళిద్దరు తరచుగా కలుసుకుంటూ సినిమా గురించి కథ గురించి డిస్కస్ చేసుకున్నప్పటికి క్లైమాక్స్ విషయంలో ఎక్కడో కొంచెం తేడా కొడుతుందనే ఉద్దేశంతో రెండు మూడు వెర్షన్స్ క్లైమాక్స్ రాసిన కూడా వెంకటేష్ కి అది నచ్చలేదట. దాంతో సినిమా స్టోరీని కొన్ని రోజులు పక్కన పెట్టేశారు.
ఇక ఆ తర్వాత అలాంటి కథతోనే మరొక హీరోతో ఒక సినిమా వచ్చిందంటూ త్రినాథ్ రావ్ నక్కిన చెప్పాడు. వెంకటేష్ తో మరోసారి అలాంటి సినిమాని చేయడం తనకి ఇష్టం లేదని చెప్పాడు. అందుకే ఆ కథను ప్రస్తుతం పక్కన పెట్టేసారట. మీ స్టోరీ తో మ్యాచ్ అయ్యే కథ తో ఏ సినిమా వచ్చిందని యాంకర్ అడిగినప్పటికి దానికి త్రినాథ్ రావు నక్కిన సమాధానం చెప్పలేదు.
ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఒకే కథలతో సినిమాలు రావడం అనేది సర్వసాధారణం. అయితే ఎవరి మేకింగ్ వాళ్లకి ఉంటుంది. కాబట్టి అందులో వైవిధ్యాన్ని చూపిస్తే ప్రతి సినిమా కూడా ప్రేక్షకుడిని మెప్పించగలుగుతుంది అని చాలామంది నమ్ముతున్నారు. దానికి తగ్గట్టుగానే కొంతమంది సినిమాలను తీసి సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు…