Homeబిజినెస్Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్.. ఆరేళ్లలోనే పూర్తి చేయొచ్చా?

Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్.. ఆరేళ్లలోనే పూర్తి చేయొచ్చా?

Home Loan: సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు చాలా మంది హోమ్ లోన్ తీసుకుంటారు. ఇతర రుణాలతో పోలిస్తే గృహ రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా తక్కువగానే ఉంటాయి. అయితే ఇల్లు కోసం చేసే అప్పును 20 లేదా 25 సంవత్సరాల్లో తీర్చాలని నిర్ణయించుకుంటే ఈ మొత్తం కాలంలో చెల్లించే వడ్డీ భారీగా ఉంటుంది. ఇలా కాకుండా మధ్యలోనే కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఈ రుణాన్ని కేవలం ఆరేళ్లలోనే పూర్తి చేయొచ్చు. అదెలాగో చూద్దాం.. హోమ్ లోన్ […]

Home Loan: సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు చాలా మంది హోమ్ లోన్ తీసుకుంటారు. ఇతర రుణాలతో పోలిస్తే గృహ రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా తక్కువగానే ఉంటాయి. అయితే ఇల్లు కోసం చేసే అప్పును 20 లేదా 25 సంవత్సరాల్లో తీర్చాలని నిర్ణయించుకుంటే ఈ మొత్తం కాలంలో చెల్లించే వడ్డీ భారీగా ఉంటుంది. ఇలా కాకుండా మధ్యలోనే కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఈ రుణాన్ని కేవలం ఆరేళ్లలోనే పూర్తి చేయొచ్చు. అదెలాగో చూద్దాం..

హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ప్రతి నెల చెల్లించే ఈఎంఐ మొత్తం పూర్తిగా అసలు రుణానికి తగ్గదు. ఇందులో ఒక భాగం వడ్డీకి, మరో భాగం ప్రిన్సిపల్‌కు వెళ్తుంది. లోన్ ప్రారంభ సంవత్సరాల్లో చెల్లించే బకాయిలో అసలు కంటే వడ్డీనే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక్కడో చిన్న పని చేయడం వల్ల వడ్డీ భారం తగ్గే అవకాశం ఉంది.

ప్రతి నెల నిర్ణయించుకున్న ఈఎంఐతో పాటు కొంత మొత్తాన్ని అదనంగా చెల్లించాలి. దీనినే పార్ట్ ప్రీపేమెంట్ అంటారు. ఉదాహరణకు ఈఎంఐ రూ.45,000 ఉందనుకుందాం. దీనికి అదనంగా రూ.10,000, రూ.20,000 లేదా మీకు వీలైన మొత్తాన్ని ప్రిన్సిపల్‌కు చెల్లిస్తే.. ఆ మొత్తం నేరుగా బకాయి అసలులో తగ్గుతుంది. తద్వారా భవిష్యత్‌లో ఆ మొత్తంపై చెల్లించాల్సిన వడ్డీ కూడా తగ్గుతుంది.

ప్రతి నెల అదనపు మొత్తాన్ని చెల్లించడం కష్టంగా ఉంటే.. ఏడాదికి కనీసం ఒక అదనపు ఈఎంఐ చెల్లించే పద్ధతిని పాటించవచ్చు. ఉదాహరణకు నెలకు రూ.40,000 ఈఎంఐ ఉంటే.. బోనస్, ఇన్సెంటివ్, అరియర్స్ లేదా ఇతర అదనపు ఆదాయం వచ్చినప్పుడు మరో రూ.40,000ను ప్రిన్సిపల్‌కు అదనంగా చెల్లించవచ్చు. ఈ మొత్తాన్ని ఉపయోగిస్తే రుణ కాలవ్యవధిని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది.

అయితే ఈఎంఐ మొత్తం కాకుండా ఇంకా అదనంగా చెల్లించాలని అనుకుంటే ముందుగా బ్యాంకును సంప్రదించాలి. బ్యాంకు లోన్ ఒప్పందంలోని నిబంధనలు, రుణ రకం, వడ్డీ విధానం ఆధారంగా పార్ట్ ప్రీపేమెంట్‌కు సంబంధించిన షరతులు మారవచ్చు. కాబట్టి పెద్ద మొత్తాన్ని చెల్లించే ముందు బ్యాంకును సంప్రదించి పార్ట్ ప్రీపేమెంట్ ఛార్జీలు ఉన్నాయా? కనీస మొత్తం ఎంత? ఏ విధంగా చెల్లించాలి? వంటి వివరాలను తెలుసుకోవడం మంచిది. ఈ విధంగా రూ.50 లక్షల రుణంను ఆరేళ్లలో పూర్తి చేయడానికి ప్లాన్ వేసుకొని చెల్లింపులు చేయాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper