Anna Lezhneva: సోషల్ మీడియా లో ఆకతాయిలు ప్రతీ హీరో అభిమానుల్లోనూ ఉంటారు. చేతిలో మొబైల్ ఉంది , ఇంటర్నెట్ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉంటారు. సెలబ్రిటీలు సాధారణంగా ఇలాంటి కామెంట్స్ పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటూ ఉంటారు , లీగల్ యాక్షన్స్ వరకు వెళ్తుంటారు. ఈమధ్య కాలం లో ఇలాంటి ఘటనలు ఎన్నో మనం చూసాము. చిన్న స్థాయి సెలబ్రిటీ నుండి పెద్ద స్థాయి సూపర్ స్టార్ వరకు ఈ సోషల్ మీడియా యుగం లో నెగెటివిటీ ని ఎదురుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు తీవ్రమైన నెగెటివిటీ ని ఎదురుకున్న సందర్భాలు కోకొల్లలు. అలా పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కూడా నెగెటివిటీ ని ఎదురుకుందట. రీసెంట్ గానే ఈమె ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే.
చాలా యాక్టీవ్ గా ఈమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ని వాడుతూ ఉంటుంది. తన దినచర్య కి సంబంధించిన అప్డేట్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతే కాదు అప్పుడప్పుడు ఈమె వాళ్ళతో సంభాషిస్తూ కూడా ఉంటుంది. రీసెంట్ గానే ఈమె తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఏదైనా ఆసక్తికరమైన ప్రశ్నలు ఒక 10 అడగండి అంటూ స్టోరీ లో పెట్టగా , వేల సంఖ్యలో ఆమెకు ప్రశ్నలు వచ్చాయి. అందులో ఒక అభిమాని అడిగిన ప్రశ్న ‘మిమ్మల్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడైనా తిడుతూ కామెంట్స్ చేశారా’ అని అడిగిన ప్రశ్నకు అన్నా కొణిదెల చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘అవును..పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు హేటర్స్ కూడా నాపై తీవ్రమైన అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. నేను వాళ్ళని బ్లాక్ చేసేదాన్ని, నన్ను ద్వేషించే వాళ్ళు నాపై చేసే కామెంట్స్ ని నేను పెద్దగా పట్టించుకోను, వాళ్ళ మీద నాకు కోపం కాదు , జాలి వేసేది’ అంటూ చెప్పుకొచ్చింది.
యాంటీ ఫ్యాన్స్ అన్నా కొణిదెల పై ట్రోల్స్ వేయడం సహజమే, కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆమె పై అసభ్య వ్యాఖ్యలు చేసేవారు అంటేనే ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే పవన్ ఫ్యాన్స్ లో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు కదా, బహుశా వాళ్ళ వైపు నుండి అన్నా కొణిదెల నెగెటివ్ కామెంట్స్ ని ఎదురుకుంటూ ఉండొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.