Ravi Teja: నేడు సినీ ఇండస్ట్రీ లో సూపర్ స్టార్స్ చాలా చలామణి అవుతూ, భోగ భాగ్యాలు అనుభవిస్తున్న వాళ్ళందరికీ అంత తేలికగా ఆ జీవితం రాలేదు. బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ సపోర్టు తో ఇండస్ట్రీ కి వచ్చిన వారికైనా , ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వారికైనా , కష్టపడితేనే కెరీర్ ఉంటుంది. లేదంటే ఎంత పెద్ద సూపర్ స్టార్ కొడుకైన కానీ షెడ్డుకి వెళ్లాల్సిందే. అందుకు ఎన్నో ఉదాహరణలు ఇప్పటి వరకు మనం చూశాము. అయితే బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన వాళ్ళు ఎన్నో అవమానాలను భరించి ఉంటారు. ఆ అవమానాల గురించి వింటేనే మన రక్తం మరిగిపోతాది , అలాంటిది అనుభవించిన వారికి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అలాంటి అవమానాలను ఎన్నో అనుభవించి ఇండస్ట్రీ లో అత్యున్నత స్థాయికి వెళ్లిన హీరో మాస్ మహారాజ రవితేజ.
ఇండస్ట్రీ లో రచయితగా , నిర్మాతగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న కోనవెంకట్ , గతం లో ఒక ఇంటర్వ్యూ లో రవితేజ కెరీర్ ప్రారంభం లో ఎదురుకున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘రవితేజ షూటింగ్ సెట్స్ లో ఒక రోజు లంచ్ బ్రేక్ లో భోజనం చేస్తున్నాడు. అప్పుడే ఆ బడా నిర్మాత సెట్స్ లోకి అడుగుపెట్టాడు. అడ్డమైన వాళ్ళందరిని ఇక్కడికి రానివ్వొద్దు అని చెప్పాను కదా, పైగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం పెట్టిస్తున్నావ్ అని డైరెక్టర్ తో అంటూ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. రవితేజ ఆ మాటలకు చాలా బాధ పడ్డాడు , మనస్తాపానికి గురయ్యాడు. కానీ అతను తన కష్టాన్ని నమ్ముకున్నాడు. కసిగా పని చేసాడు, అంచలంచలుగా ఎదుగుతూ పెద్ద సూపర్ స్టార్ అయ్యాడు. రవితేజ డేట్స్ కోసం టాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూలో నిల్చునే రోజులు వచ్చాయి’.
‘ఒకరోజు రవితేజ ని అవమానించిన ఆ బడా నిర్మాత ఆయన క్యారవాన్ బయట రవితేజ అపాయిట్మెంట్ కోసం తిరుగుతూ ఉన్నాడు. బయట పలానా నిర్మాత నాకోసం ఎదురు చూస్తున్నాడు అసిస్టెంట్ రవితేజ కి చెప్పాడు. నేను ఆరోజు అతనితోనే ఉన్నాను. గతం లో ఆ నిర్మాత తన పట్ల చేసిందంతా రవితేజ నాకు చెప్పాడు. చూసావా దేవుడు అతన్ని నీ కాళ్ళ దగ్గరకి వచ్చేలా చేసాడు , నిన్ను అంతలా అవమానించిన ఆ నిర్మాతకు డేట్స్ ఇవ్వకు అని చెప్పాను. కానీ రవితేజ నేను ఇస్తాను అని చెప్పాడు. నా నిజమైన సక్సెస్ ఏంటో చెప్పమంటావా కోనా, అతనికి డేట్స్ ఇచ్చి , అతని సినిమాలోనే హీరో గా చేయడం’ అంటూ చెప్పుకొచ్చాడు కోనవెంకట్. కష్టం , టాలెంట్ ఉంటే దేవుడు ఎలాంటి జీవితాన్ని ఇస్తాడో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏమి ఉంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.