Toxic Movie: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేస్తూ సూపర్ సక్సెస్ ను సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే కెజిఎఫ్ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా నిలిచిన యశ్ ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ నెల 26వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకుల్లో సినిమా మీద అంచనాలు అమాంతం తార స్థాయికి వెళ్లిపోయాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కథని మొదట ఒక స్టార్ హీరోకి వినిపించారట. కానీ ఆయన ఈ సినిమా చేయడానికి పెద్దగా ఇష్టపడలేదట.
దానివల్ల ఈ కథని తను రిజెక్ట్ చేసినట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇంతకీ ఈ సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరు అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు ను సంపాదించుకున్న సూర్య కావడం విశేషం… ఈ సినిమాలో చాలా వరకు బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని అందువల్లే సూర్య ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా టాక్సిక్ సినిమా సూపర్ సక్సెస్ అయితే మాత్రం సూర్య కొంతవరకు రిగ్రేట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఏది ఏమైనా కూడా యాడ్ ఈ మూవీకి చాలా బాగా సెట్ అయ్యాడు. ఆయన పర్ఫెక్ట్ గా తన క్యారెక్టర్ ని పోట్రే చేసినట్టుగా కనిపిస్తుంది. కేజిఎఫ్ సినిమాలోనే ఒక మాస్ పర్ఫామెన్స్ ని ఇచ్చిన ఆయన ఈ సినిమాలో అంతకుమించి అనేలా తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా కనిపిస్తున్నాడు.
ఇక ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని మూట గట్టుకుంటుంది. ప్రేక్షకులందరిని సంతృప్తి పరుస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ నెల 26వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ మూవీ సక్సెస్ అయితే మరోసారి యశ్ పేరు పాన్ ఇండియాలో మారుమ్రోగిపోతుంది…