Agnipariksha 2 Promo: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘అగ్నిపరీక్ష 2’ టెలికాస్ట్ అవ్వడానికి సరిగ్గా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ షోకి సంబంధించిన షూటింగ్ ఇప్పటి వరకు 4 రోజులు పూర్తి అయ్యింది . నేడు కూడా షూటింగ్ సాగుతోంది. ఈ షూటింగ్స్ ద్వారా ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు , ఎవరెవరు రిజెక్ట్ అయ్యారు వంటివి గతం లో మేము కొన్ని కథనాల ద్వారా వివరించాము. 25 వేల అప్లికేషన్స్ నుండి కేవలం 70 మంది మాత్రమే ఆడిషన్స్ కి సెలెక్ట్ అయ్యారు. ఈ 70 మంది ఆడిషన్స్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ని ఈ నెల 15 నుండి స్టార్ మా ఛానల్ , జియో హాట్ స్టార్ లో చూడబోతున్నాము. ఇదంతా పక్కన పెడితే ఈ షో కి సంబంధించిన మెయిన్ ప్రోమో ని విడుదల చేశారు మేకర్స్.
ఈ ప్రోమో లోని కంటెస్టెంట్స్ ప్రతీ ఒక్కరు ఆసక్తికరంగా ఉన్నారు. అయితే ఒక కంటెస్టెంట్ జడ్జీలను మోసం చేయడాన్ని శ్రీముఖి కనిపెట్టింది. జడ్జీలను మోసం చేయడానికి ఎంత ధైర్యం నీకు అని నిలదీసింది. ఆ తర్వాత జడ్జీలు అతనికి రెడ్ కార్డు ఇచ్చి పంపేశారు. ఇక చివర్లో మరో కంటెస్టెంట్ అభిజిత్ అన్న టైటిల్ గెలిచిన తర్వాత రెండేళ్లు కనిపించకుండా పోయాడు అని అంటాడు. అందుకు అభిజిత్ నాకేమి పని లేదని అనుకున్నావా?, నిన్ను బిగ్ బాస్ కి పంపడం లేదంటూ రెడ్ కార్డు చూపిస్తాడు. ఇక రాజా కుమారి డయానా అనే అమ్మాయి ఈ ప్రోమో లో జడ్జీలను విపరీతంగా అలరించింది. ఈమె తెలుగు ని ఎడుమ నుండి కుడికి రివర్స్ లో రాసింది. దాన్ని అద్దం లో పెట్టి చూస్తే ఒక్క అక్షరం కూడా పొల్లు పోలేదు. దీనికి జడ్జీలలో ఒకరైన నవదీప్ ఆశ్చర్యానికి గురయ్యాడు.
అదే విధంగా ఒక మహిళా రైతు బిడ్డ కి కూడా జడ్జీలు ఆకర్షితులు అయ్యారు. ఈమె గవర్నమెంట్ జాబ్స్ కోసం కూడా ప్రిపేర్ అవుతుందట. ఒకవేళ జాబ్ వస్తే వ్యవసాయం వదిలేస్తావా అని బిందు మాధవి అడగడం ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా హౌస్ lo ఎలా ఉంటావు మరీ , తట్టుకోగలవా అని యాంకర్ శ్రీముఖి అడగ్గా , అందుకు ఈమె నాకు ఏదైనా టాస్క్ ఇవ్వండి , అందులో ఓడిపోతే నేను వీక్ అని ఒప్పుకుంటాను అని అంటుంది. ఓవరాల్ గా ప్రోమో చాలా ఫైర్ మీద ఉంది. పూర్తి ఎపిసోడ్ లో ఇంకెంత ఫైర్ ఉంటుందో చూడాలి. ఈ ప్రోమో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.