Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు… ఈయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్ ఏర్పడుతుంది. నిజానికి మహేష్ బాబు సినిమాని ప్రేక్షకులతో పాటు కొంతమంది స్టార్ హీరోలు సైతం మొదటి రోజే చూస్తారనే విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, అడివి శేషు లాంటి హీరోలు మహేష్ బాబు సినిమాని మొదటి రోజు మొదటి షోనే చూస్తారట. ఇక వీరితోపాటుగా సీనియర్ హీరో అయిన చిరంజీవి సైతం ఇప్పటికి మహేష్ బాబు సినిమాని మొదటి షోనే చూడడానికి ఇష్టపడుతూ ఉంటారట. ఈ జనరేషన్ లో ఉన్న నటనలలో రామ్ చరణ్ తో పాటు మహేష్ బాబు నటన అంటే చిరంజీవి చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పాడు. చిరంజీవి కెరీర్ స్టార్టింగ్ లో కూడా తనకి కృష్ణ గారంటే అభిమానం ఉండేదట. వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధం కూడా ఉందని చిరంజీవి పలు వేదికలపైన చెబుతూనే ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు సైతం చిరంజీవి మా అందరికి ఒక ఇన్స్పిరేషన్, ఆయన ప్రతి క్యారెక్టర్ ను ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తూ ఉంటాడు.
అందుకే ఆయన మా జనరేషన్ కి ఒక గొప్ప టీచర్ లాంటివారు అని మహేష్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పటికి మహేష్ బాబు సినిమాని మొదటి రోజు మొదటి షో చిరంజీవి చూసి మహేష్ కి ఫోన్ చేసి సినిమా గురించి మాట్లాడుతూ ఉంటాడట. చిరంజీవి చెప్పే విషయాలు చాలా జన్యున్ గా ఉంటాయని మహేష్ బాబు చెప్పాడు.
చిరంజీవి చాలా స్ట్రెయిట్ గా మూవీ బావుంటే బావుందని, బాలేకపోతే బాలేదని మొహం మీదనే చెప్పేస్తారట. దాంతో పాటుగా యాక్టింగ్ విషయంలో కూడా ఒక్కొక్క సన్నివేశం గురించి ప్రస్తావిస్తూ మహేష్ బాబు నట పొటెన్షాలిటి ని పొగుడుతూ మాట్లాడుతూ ఉంటాడట.
మహేష్ అనే కాదు ఇండస్ట్రీలో ఈ హీరో సక్సెస్ సాధించిన కూడా చిరంజీవి వాళ్ళను ఎంకరేజ్ చేస్తుంటాడనేది వాస్తవం…మనతోపాటు మన వాళ్ళు కూడా ఎదగాలని కోరుకోవడం నిమగ చాలా గొప్ప వ్యక్తిత్వం… అది ఉండ కాబట్టే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు. ఇప్పటికి తనను బీట్ చేసే హీరో లేడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…