Allu Arjun
Allu Arjun : పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ తదుపరి చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడని సమాచారం. ఆయన విదేశాల్లో శిక్షణ కూడా తీసుకున్నాడట. విశ్వసనీయ వర్గాలు అందించిన ఈ సమాచారం అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంది.
అల్లు అర్జున్ కెరీర్ గురించి చెప్పాలంటే పుష్ప కి ముందు పుష్ప తర్వాత అని చెప్పొచ్చు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2021లో విడుదలై భారీ విజయం నమోదు చేసింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక పుష్ప 2 దేశాన్ని ఊపేసింది. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ గా అల్లు అర్జున్ అవతరించాడు. పుష్ప 2 హిందీ వెర్షన్ రూ. 800 కోట్లకు పైగా రాబట్టడం, ఎవరూ ఊహించని పరిణామం. అన్ని భాషల్లో వరల్డ్ వైడ్ పుష్ప 2 రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
పుష్ప 2 చిత్రానికి అల్లు అర్జున్ రూ. 300 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. పుష్ప 2 వసూళ్ల నేపథ్యంలో ఈ ఫిగర్ పెరిగినా ఆశ్చర్యం లేదు.నార్త్ లో అల్లు అర్జున్ కింగ్ గా అవతరించాడు. మరి పుష్ప 2 వంటి ఇండస్ట్రీ హిట్ అనంతరం అల్లు అర్జున్ ఎలాంటి చిత్రం చేస్తాడనే ఆసక్తి అందిరిలో నెలకొంది. అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి త్రివిక్రమ్ ఆయన కోసం ఎదురుచూస్తున్నారు.
అల్లు అర్జున్ రేంజ్, ఇమేజ్ కి తగ్గట్లు భారీ స్థాయిలో పాన్ ఇండియా సబ్జెక్టు త్రివిక్రమ్ రాసుకున్నాడు. ఇది మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని వినికిడి. అనూహ్యంగా అట్లీ పేరు తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ తన ఫేవరేట్ డైరెక్టర్ త్రివిక్రమ్ ని పక్కన పెట్టి, అట్లీకి ఛాన్స్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ ఆగస్టు తర్వాత ఉంటుందని అంటున్నారు. త్వరలో అట్లీ మూవీపై ప్రకటన ఉండొచ్చు అని టాలీవుడ్ టాక్.
Also Read : అల్లు అర్జున్ ఆ ఒక్క విషయంలో తగ్గాల్సిందేనా..?అట్లీ, త్రివిక్రమ్ లలో ముందు ఎవరితో సినిమా చేస్తాడు..?
బన్నీ వాసు తాజాగా అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీపై కొంత సమాచారం ఇచ్చాడు. సదరు ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ విదేశాల్లో శిక్షణ తీసుకున్నాడట. త్వరలో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన ఉంటుందని, అన్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే.. అల్లు అర్జున్-అట్లీ మూవీపై ప్రకటన రావచ్చనే ప్రచారం జరుగుతుంది. ఇక విదేశాల్లో శిక్షణ తీసుకున్నాడంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ ఓ రేంజ్ లో ఉంటుందని, యాక్షన్ ఎపిసోడ్స్ దుమ్మురేగుతాయని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read : అల్లు అర్జున్ అభిమానులకు చేదు వార్త..ఇప్పట్లో ఇక లేనట్టే..సంచలన అప్డేట్ ఇచ్చిన నిర్మాత!
Web Title: Allu arjun train abroad next movie update
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com