Akkineni Nagarjuna: అద్భుతమైన ప్రతిభ ఉన్న ఎంతో మంది టాలెంటెడ్ యువత , సినీ ఇండస్ట్రీ లో అవకాశాల కోసం తిరుగుతూ కృష్ణ నగర్ లోనే తమ జీవితాన్ని ముగించిన రోజులు చాలానే ఉన్నాయి. వీళ్లకు తమ టాలెంట్ ని చూపించుకుని సరైన వేదిక ఒకప్పుడు ఉండేది కాదు , ఎవరిని అప్రోచ్ అయితే తమ టాలెంట్ ని చూపించే అవకాశం వస్తుందో తెలీదు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు , సోషల్ మీడియా కారణంగా తమ టాలెంట్ ని చూపించుకుని అవకాశం యూత్ కి దక్కింది. అలా తమ టాలెంట్ ని చూపించి ఎంతో మంది సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయినవాళ్లు ఉన్నారు. ఇప్పుడు టాలెంట్ ఉన్న యూత్ ని సినీ స్టార్స్ స్వయంగా గుర్తించి ప్రోత్సహించే రేంజ్ కి వచ్చారు. అలాంటి స్టార్స్ లో ఇప్పుడు అక్కినేని నాగార్జున కూడా చేరిపోయారు.
అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ప్రతిభ ఉన్న యువతని గుర్తించి , సినీ ఇండస్ట్రీ లోకి తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలా ఆయన కొత్త యువత ని ప్రోత్సహించడం వల్ల తెరకెక్కిన చిత్రం ‘పళ్ళబురుసు’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ ‘కొత్త కథలతో ఎవరైనా వస్తే ప్రోత్సహించడానికి మా అన్నపూర్ణ స్టూడియోస్ సిద్ధంగా ఉంది. ముందు మీరు చెప్పే కథలను మా టీం వింటుంది. వాళ్ళు నచ్చితే కచ్చితంగా నేను కూడా వింటాను. గతం లో కూడా మా స్టూడియోస్ ఇలాంటి వారిని గుర్తించింది. ఇప్పుడు మరింత వేగంగా కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నాము. స్టూడియో అంటే కేవలం సినిమా షూటింగ్స్ కి లీజుకి ఇచ్చి డబ్బులు సంపాదించడం మాత్రమే కాదని , సినీ ఇండస్ట్రీ కి ఎదో ఒకటి ఇవ్వాలని , ఇలాంటి టాలెంట్ ని ప్రోత్సహిస్తూ సినిమాలను నిర్మిస్తున్నాము’.
‘అలాంటి సినిమాల కోవలోకి ఈ ‘పళ్ళబురుసు’ కూడా చేరుతుంది. ఉదయ్ చౌహాన్ కథ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని చాలా ఎంటర్టైన్మెంట్ పద్దతిలో తెరకెక్కించాడు. రీసెంట్ గానే మా స్టూడియోస్ లో తెరకెక్కిన లెనిన్ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు పళ్ళబురుసు కూడా హిట్ అవ్వబోతుంది అనే నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు అక్కినేని నాగార్జున. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మరి ఇంకెందుకు ఆలస్యం?, మీలో టాలెంట్ ఉంటే వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లి మీ వద్ద ఉన్న కథలను వినిపించండి. అదృష్టం బాగుంటే మీరు కూడా డైరెక్టర్ అయిపోవచ్చు.