Allu Arjun : ‘పుష్ప 2′(Pushpa 2 Movie) చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఇండియా లోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఇక్కడి వరకు అభిమానులకు గూస్ బంప్స్ మూమెంట్స్ కలిగాయి. కానీ ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ఏ సినిమా చేయబోతున్నాడు అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. కనీసం అల్లు అర్జున్ కి అయినా ఆ విషయంలో క్లారిటీ ఉందా అంటే అనుమానమే. అలా తయారైంది ప్రస్తుత పరిస్థితి. త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తో మైథాలజీ సబ్జెక్టు మీద ఒక సినిమా చేయబోతున్నాడని అన్నారు. కానీ ఆ సినిమా స్క్రిప్ట్ పూర్తి అవ్వడానికి చాలా సమయం పట్టేలా ఉంది. అందుకే అల్లు అర్జున్ అట్లీ(Director Atlee) తో చేయబోయే సినిమాని మొదలు పెట్టాలని అనుకున్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే అట్లీ నిర్మాతలను ఏకంగా వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడట.
Also Read :అల్లు అర్జున్ ఆ ఒక్క విషయంలో తగ్గాల్సిందేనా..?అట్లీ, త్రివిక్రమ్ లలో ముందు ఎవరితో సినిమా చేస్తాడు..
ఆ రేంజ్ డబ్బులు ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకోలేదని సమాచారం. ఈ విషయం లో చిన్నపాటి చర్చలు నడుస్తున్నాయి. అట్లీ మాత్రం వంద కోట్ల రెమ్యూనరేషన్ కి ఒక్క పైసా తగ్గినా ఒప్పుకోవడం లేదు, అల్లు అర్జున్ స్వయంగా చొరవ తీసుకొని మాట్లాడితే తప్ప ఈ విషయం సెటిల్ అయ్యేలా కనిపించడం లేదు. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితంగా ఉండే ‘బన్నీ వాసు’ ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ విదేశాల్లో నెల రోజుల పాటు తీసుకున్న స్పెషల్ ట్రైనింగ్ గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ గారు ఈరోజు ఉదయమే విదేశాల నుండి వచ్చాడు. ఇంకా నేను ఆయన్ని కలవలేదు. అల్లు అర్జున్ గారు నటనలో కొత్త పద్దతులను నేర్చుకోవడానికి నిరంతరం రీ సెర్చ్ చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఆయన విదేశాల్లో నెలరోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
తదుపరి చిత్రం అల్లు అర్జున్ ఎవరితో చేయబోతున్నాడు అని విలేఖరులు అడగగా, అది మూవీ టీం వాళ్ళు త్వరలోనే తెలియచేస్తారు అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ వాసు. ఉగాది లోపు అల్లు అర్జున్ కొత్త సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ లుక్స్ ఏ రేంజ్ లో మారిపోయాయో మనమంతా చూసాము. దాదాపుగా పదేళ్ల వెనకెక్కి ఆయన వెళ్లినట్టు గా అనిపించింది. ఈ రేంజ్ మేక్ ఓవర్ ఏ సినిమా కోసం చేస్తున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Also Read : అల్లు అర్జున్ అభిమానులకు చేదు వార్త..ఇప్పట్లో ఇక లేనట్టే..సంచలన అప్డేట్ ఇచ్చిన నిర్మాత!