Diwali celebrations : ఒకే ఫ్రేమ్ లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్.. దీపావళి పండుగలో షేక్ చేసే ఫొటోలు.. వైరల్

మెగాహీరో రామ్ చరణ్ తనకు కూతురు పుట్టాక పట్టరాని ఆనందంలో మునిగారు. అప్పటి నుంచి చిన్న వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. తన పాపకు భారసాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి క్లింకార అని పేరుపెట్టారు.

  • Written By: NARESH
  • Published On:
Diwali celebrations : ఒకే ఫ్రేమ్ లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్.. దీపావళి పండుగలో షేక్ చేసే ఫొటోలు.. వైరల్

Follow us on

Diwali celebrations : 2023 దీపావళి తెలుగు చిత్ర సీమకు ప్రత్యేకం అని చెప్పొచ్చు. సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రెటీలు వివిధ పద్ధతుల్లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. కొందరు తారలు మరికొందరిని తమ ఇంటికి ఆహ్వనించి విందు ఏర్పాటు చేశారు. ఇంకొందరు పేద పిల్లల మధ్య వేడుకలు నిర్వహించుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మెగా హీరో చిరంజీవి దీపావళి వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొందరు ప్రముఖులను ఇంటికి ఆహ్వానించారు. వీరిలో వెంకటేశ్, నాగార్జునలు ఉండడం విశేషం. ఈ సందర్భంగా చిరంజీవి, వెంకటేష్, నాగార్జులను ఒకే ప్రేమ్ లో కనిపించడం అందరినీ ఆకర్షిస్తోంది.

మెగాహీరో రామ్ చరణ్ తనకు కూతురు పుట్టాక పట్టరాని ఆనందంలో మునిగారు. అప్పటి నుంచి చిన్న వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. తన పాపకు భారసాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి క్లింకార అని పేరుపెట్టారు. ఇక తాజాగా దీపావళి వేడుకలను మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలను ఆహ్వానించారు. వీరిలో వెంటకేష్, నాగార్జునలతో పాటు అల్లు కుటుంబం కూడా హాజరైంది.

సినీ ఇండస్ట్రీలో 1980 నుంచి 2000 సంవత్సరా వరకు పోటీ పి ఒకరికొకరు సినిమాలు తీసేవారు. వీరు ముగ్గురు చాలా తక్కువ సందర్భంలో కలుసుకునేవారు. గతంలో బయట జరిగే ఈవెంట్లలోనూ ఎక్కువగా కలుసుకునేవారు కాదు. కానీ ఈ దీపావళి వేడుకలో ఒకేసారి ముగ్గురు లెజెండ్స్ కలుసుకోవడం ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో వీరి ఫొటోలో సోషల్ మీడియాలో సందడిగా మారాయి. ఎన్నడూ లేని అనుభూతి పొందుతున్నట్లు ఆయా హీరోల ఫ్యాన్స్ కామెంట్టు పెడుతున్నారు.

వీరితో పాటు మిగతా సెలబ్రెటీలు వివిధ పద్ధతుల్లో దీపావళి వేడుకలు నిర్వహించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలతో కలిసి సెలబ్రెషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి ఫ్యామిలీ పిక్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అలాగే మంచు లక్ష్మీ పేద పిల్లలతో కలిసి వేడుకలను నిర్వహించుకున్నారు. మొత్తానికి ఈ దీపావళి సెలబ్రెటీల ఇళ్లలలో ఘనమైన వెలుగులు నింపిందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Gossips News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు