బీజేపీ చిన్న పార్టీనా? టీడీపీ ఏం చెబితే అది వింటారా? టీడీపీ, బీజేపీ కలయికపై ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారం.
ఇండియా టుడే సర్వే అంచనాలతో ఆంధ్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
టాప్ 15 అత్యంత ధనవంతులున్న పార్టీలు చూసుకుంటే 7వ ర్యాంకులో నారా చంద్రబాబు, 13వ ర్యాంకులో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. అంటే 200 కోట్లకు పైబడిన ఆస్తులున్న లిస్ట్ చూసుకుంటే ఆంధ్రాలో 13 మంది ఉన్నారు.
సినిమా షూటింగ్ లకు పవన్ వెళ్లాడని తెలిసింది. కొన్ని రోజులు కాల్షీట్లు ఇచ్చాడని అంటున్నారు. ఇచ్చినా ఎక్కువ సమయం రాజకీయాలకు పవన్ కేటాయిస్తే ఆయనకు తిరుగుండదు.
జగన్ కంటే చంద్రబాబు బెటర్ అన్న క్లియర్ కట్ మెసేజ్ ను పవన్ ఇచ్చారు. బీజేపీని వదిలి పవన్ పోటీచేయరని తేలిపోయింది. టీడీపీతో కలిసి వెళ్లాలా వద్దా? అన్నది సమాలోచనలు చేస్తామన్నారు.
వైసీపీ చేసిన దారుణాలను కళ్లకు కట్టినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పులు చేతిలో పట్టుకొని మరీ చూపించారు. విశాఖ రాజకీయాలను పవన్ కళ్యాణ్ షేక్ చేశాడు.
ఆగస్టు 15 సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతలు ఏం మాట్లాడారు? పవన్ ఏం మాట్లాడారు.? చూస్తే ఈ ఒక్కటి చాలు నాయకుడికి ఎందుకు కనెక్ట్ అవుతున్నారని తెలుసుకోవడానికి దోహదపడుతుంది.
పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లింది జగన్ కోసం కాదు.. రుషికొండను రక్షించుకోవడం.. ప్రకృతికి కాపాడుకోవడం కోసమే అక్కడికి వెళ్లాడు.. పవన్ కళ్యాణ్ పర్యటనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
ఈ శిక్షణ శిబిరంలో పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైన పాయింట్ ను ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు. బెంగాల్ తరహా ఎన్నికలు జరుగబోతున్నాయి. హింసతో కూడిన ఎన్నికలు. మమతా బెనర్జీ బెంగాల్ లో హింసతో గెలుస్తున్నారు. ఆ మోడల్ ను జగన్ ఏపీలో తీసుకొస్తున్నాడని పవన్ చెప్పకనే చెప్పాడు.
గత రెండు వారాహి యాత్రల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. యాత్ర మొదలుపెట్టినప్పుడు లేని పాపులారిటీ ముగిసే వరకూ భారీగా వచ్చేసింది. క్షేత్రస్థాయిలో గణనీయమైన మార్పు వచ్చింది. పవన్ తిరిగిన ప్రదేశాల్లో ఓపినియన్ పోల్ తీసేటట్టు అయితే.. టీడీపీ, వైసీపీ, జనసేనల్లో నంబర్ 1 పార్టీగా జనసేన నిలువబోతోంది.
ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి దేశాన్ని కదిలిస్తున్న మోడీని ఆదర్శంగా తీసుకున్నారు. ఇద్దరూ నిజాయితీపరులు. జనం కోసం పరితపించేవారు. ఇద్దరూ అతిసామాన్య కుటుంబం నుంచి వచ్చినవారే.
వారాహి యాత్రకు ఇప్పుడు గ్యాప్ వచ్చింది. నెక్ట్స్ వారాహి యాత్ర తలుచుకోరు అని అనుకుందాం.. మధ్యలో ‘బ్రో’ సినిమా వచ్చింది. బ్రో ప్రీ రిలీజ్ లో పవన్ రాజకీయాలు మాట్లాడలేదు. కానీ రిలీజ్ అయ్యాక బ్రోకు వ్యతిరేకంగా వైసీపీ ఎంతో ప్రచారం చేస్తోంది. కొత్తగా మంత్రులే ‘బ్రో’ రివ్యూలు చెబుతున్నారు.. కలెక్షన్లు చెబుతున్నారు.
మొన్న జోగిరమేష్, నిన్న వాసిరెడ్డి పద్మలు నేరుగా పవన్ కళ్యాణ్ పై అటాక్ చేయడం వెనుక జగన్ రాజకీయం ఉంది. జగన్ సూత్రధారి అయితే వీళ్లు పాత్రధారులు.. జగన్ ఉండగానే జోగిరమేష్ తో స్టేజీమీదనే మాట్లాడించుకొని పవన్ ను తిడుతుంటే ముసిముసినవ్వాడు.
ముఖ్యమంత్రి స్టేజీ మీద కూర్చుండబెట్టుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో మంత్రుల చేత తిట్టించడాన్ని ఏమనాలో అర్థం కాని పరిస్థితి.. జగన్ హయాంలో కుక్కలు, నక్కల పాలైన ఆంధ్రప్రదేశ్ గా అందరూ తిట్టిపోస్తున్నారు.
ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని ఇలా చేయడం ఆ స్థాయి హుందాతనం తగ్గించుకున్నట్టు అవుతోంది. ఇది కలియుగం కాక మరేంటి? అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. నేరాలు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు శ్రీరంగనీతులు చెప్తుంటే కలియుగం కాక మరేంటి?
పవన్ ను చూసి భయపడుతూ ఇలా చేస్తున్నాడు. జగన్ తప్పుడు కేసులు పవన్ కళ్యాణ్ కి పూల మాలలుగా మారబోతున్నాయా? అన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
సీపీఐ నారాయణ మాత్రం సిద్ధాంతాల గురించి మాట్లాడరు.. మాట్లాడితే.. నోటి దూల.. వ్యక్తిత్వ హననం మీదనే మాట్లాడుతాడు. ఇది కమ్యూనిజం సిద్ధాంతం కాదు. అవతల వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేసే వారిని కమ్యూనిస్టులు అనరు..