Homeప్రత్యేకంPawan Kalyan : చంద్రబాబు అరెస్ట్, టీడీపీతో పొత్తు తర్వాత జరిగే మొదటి వారాహి యాత్రపై...

Pawan Kalyan : చంద్రబాబు అరెస్ట్, టీడీపీతో పొత్తు తర్వాత జరిగే మొదటి వారాహి యాత్రపై ఆంధ్రా అంతా ఎదురుచూపు

పొత్తు ప్రకటించడంతో తెలుగుదేశం, జనసేన కలిసి యాత్రలో చేస్తారని అనుకున్నారు. కానీ టీడీపీ యాత్ర, జనసేన యాత్రలు వేర్వేరుగానే ఉండనున్నాయి.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర 4 చాలా చిన్న యాత్రగా ఉంది. కేవలం 4 నియోజకవర్గాలు, 6 రోజులు ఒక్క జిల్లా కవర్ చేయనున్నారు. అదీ డెల్టా ప్రాంతంలో ప్రచారం చేయనున్నారు. ఇది చాలా ప్రత్యేకతతో కూడిన యాత్రగా భావించాలి. తెలుగుదేశంతో పొత్తుతో తర్వాత జరుగుతున్న యాత్ర. రెండోది చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరుగుతున్న యాత్ర. 3వది తనను అత్యంత దారుణంగా, బూతులు తిట్టిన వైసీపీ మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని, కొడాలి నానిల నియోజకవర్గాల మీదుగా సాగనుంది. ఈ యాత్ర ఎలా ఉండబోతోంది. ఎలా ఉండాలన్నది అనాలసిస్ చేద్దాం.

ఇప్పటికే ఈ యాత్రపై నాదెండ్ల మనోహర్ కృష్ణ జిల్లా అధ్యక్షులు, నేతలతో సమావేశమయ్యారు. పవన్ పొత్తులపై తీర్మానం, ఐక్యకార్యాచరణ దిశగా వాళ్లు చర్చించుకున్నారు. మూడోది వారాహి యాత్ర, నిర్మాణ పరమైన విషయాలు ఇందులో చర్చించుకున్నట్టు తెలుస్తోంది.

పొత్తు ప్రకటించడంతో తెలుగుదేశం, జనసేన కలిసి యాత్రలో చేస్తారని అనుకున్నారు. కానీ టీడీపీ యాత్ర, జనసేన యాత్రలు వేర్వేరుగానే ఉండనున్నాయి. పొత్తులు కొలిక్కి వచ్చి సీట్లు, ఇతర అన్నీ కుదిరాక ఉమ్మడి కార్యాచరణ ఉంటుంది. అంతవరకూ టీడీపీ, జనసేనలు వేర్వేరుగానే సాగనున్నాయి.

చంద్రబాబు అరెస్ట్, టీడీపీతో పొత్తు తర్వాత జరిగే మొదటి వారాహి యాత్రపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper