Highest Grossing Films of 2021: భారీ వసూళ్లు రాబట్టిన చిత్రాలివే.. 100 కోట్లు అవలీలగా దాటేసిన బాలయ్య, పవన్, బన్నీ

Highest Grossing Films of 2021: సినిమా కళాత్మక వ్యాపారం. పరిశ్రమ మనుగడ విజయం పైనే ఆధారపడి ఉంటుంది. ఓ హిట్ మూవీ అనేక మంది లైఫ్స్ సెట్ చేస్తుంది. 2020 సంవత్సరంలో టాలీవుడ్ తీవ్ర సంక్షోభం ఎదుర్కొనగా… 2021లో కొంత గాడినపడింది. ఈ ఏడాది విడుదలైన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ దుమ్ముదులిపాయి. ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన లేటెస్ట్ మూవీ పుష్ప తో ప్రభంజనం సృష్టిస్తున్నారు. పాన్ ఇండియా […]

  • Written By: Shiva
  • Published On:
Highest Grossing Films of 2021: భారీ వసూళ్లు రాబట్టిన చిత్రాలివే..  100 కోట్లు అవలీలగా దాటేసిన బాలయ్య, పవన్, బన్నీ

Follow us on

Highest Grossing Films of 2021: సినిమా కళాత్మక వ్యాపారం. పరిశ్రమ మనుగడ విజయం పైనే ఆధారపడి ఉంటుంది. ఓ హిట్ మూవీ అనేక మంది లైఫ్స్ సెట్ చేస్తుంది. 2020 సంవత్సరంలో టాలీవుడ్ తీవ్ర సంక్షోభం ఎదుర్కొనగా… 2021లో కొంత గాడినపడింది. ఈ ఏడాది విడుదలైన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ దుమ్ముదులిపాయి. ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించాయి.

Highest Grossing Films of 2021

Balakrishna and Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన లేటెస్ట్ మూవీ పుష్ప తో ప్రభంజనం సృష్టిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన పుష్ప తెలుగు రాష్ట్రాల్లో రికార్డు వసూళ్లు రాబడుతుంది. హిందీతో పాటు మిగతా భాషల్లో కూడా పుష్ప వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. దర్శకుడు సుకుమార్ క్రైమ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పుష్ప తెరకెక్కించగా బన్నీ డీగ్లామర్ రోల్ చేశారు. మూడు రోజుల్లో పుష్ప ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 173 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది.

పాలిటిక్స్ కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చారు. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ నుండి వచ్చిన వకీల్ సాబ్ వసూళ్ల వర్షం కురిపించింది. హిందీ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. దిల్ రాజు వకీల్ సాబ్ చిత్రానికి నిర్మాతగా ఉన్నారు.

Highest Grossing Films of 2021

Allu Arjun and Pawan Kalyan

వరుస పరాజయాలకు బ్రేక్ ఇచ్చి.. అఖండ మూవీతో బాలయ్య సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టారు. దర్శకుడు బోయపాటి శ్రీను అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా అఖండ చిత్రాన్ని తీర్చిదిద్దారు. బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో కనిపించి ఫ్యాన్స్ ని అబ్బురపరిచారు. ముఖ్యంగా అఘోర పాత్రలో ఆయన నట విశ్వరూపం థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డ్స్ వెలిసేలా చేసింది. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో అఖండ నిలకడగా వసూళ్లు రాబడుతుంది. ఇప్పటి వరకు అఖండ రూ. 115 కోట్ల గ్రాస్ సాధించింది.

Also Read: పవన్ అక్కగా మారనున్న ఒకప్పటి హోమ్లీ హీరోయిన్ !

డెబ్యూ డైరెక్టర్, హీరో, హీరోయిన్… ఇలా కొత్త సరుకుతో సరికొత్తగా సబ్జెక్టు తో తెరకెక్కింది ఉప్పెన. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఉప్పెన చిత్రాన్ని తెరకెక్కించారు. చిరు మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఉప్పెన యూత్ కి తెగ నచ్చేసింది. హీరోయిన్ కృతి గ్లామర్, దేవిశ్రీ సాంగ్స్ మూవీ విజయంలో కీలక పాత్ర వహించాయి. ఊహించని విధంగా ఉప్పెన రూ. 100 కోట్ల గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలను షాక్ కి గురిచేసింది.

చిన్న మూవీగా విడుదలై పెద్ద విజయం సాధించిన మరో చిత్రం జాతిరత్నాలు. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నూతన దర్శకుడు అనుదీప్ కేవీ జాతిరత్నాలు మూవీ తెరకెక్కించారు. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జాతిరత్నాలు రూ. 70 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

Also Read: ‘పుష్ప’లో బన్నీకి తల్లిగా నటించిన ఆమె ఎంత స్టైలిష్ గా ఉందో చూశారా?

క్రాక్ మూవీతో 2021కి శుభారంభం పలికారు మాస్ మహారాజ్ రవితేజ. ఏడాది ఫస్ట్ హిట్ గా క్రాక్ రికార్డులకు ఎక్కింది. క్రాక్ అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య విడుదలై భారీ విజయం అందుకుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని చాలా గ్యాప్ తర్వాత క్రాక్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. పోలీసుగా రవితేజ మాస్ మేనరిజం, శృతి గ్లామర్, డైరెక్టర్ గోపీచంద్ టేకింగ్ సినిమాను గొప్పగా మలిచాయి. క్రాక్ మూవీ రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

వెంకీ మామ చిత్రంతో హిట్ కొట్టిన నాగ చైతన్య లవ్ స్టోరీ రూపంలో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ తెరకెక్కించారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ 2021 హైయెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. లవ్ స్టోరీ చిత్రం రూ. 58 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం.

ఒక్క హిట్ అంటూ తపిస్తున్న అక్కినేని హీరో అఖిల్ దాహం తీర్చింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ క్లీన్ హిట్ గా నిలిచింది. లక్కీ లేడీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రూ. 50 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది .

Also Read: బాలయ్య సినిమాలో మరో యాక్షన్ హీరో ?

Tags

    Read Today's Latest 2020 round up News, Telugu News LIVE Updates on Oktelugu