Nara Lokesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయి అన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. కానీ ఆరోపణకు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే న్యాయస్థానాల్లో సైతం ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కావడం లేదు. విచారించకుండానే కోర్టులు కొట్టివేస్తున్నాయి అంటే.. డీఎస్సీ 2025 విషయంలో ప్రభుత్వం ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో అర్థం అవుతోంది. అయితే ఇప్పుడు వైసిపి ఏవేవో ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే లోకేష్ ఒక్క అడుగు ముందుకు వేసి రాజీనామా చేస్తే నష్టం ఎవరికి. అది కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. నైతిక బాధ్యత వహిస్తూ తన పదవితో పాటు మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి.
* మంగళగిరిలో నో ఛాన్స్..
మంగళగిరిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. అక్కడ నాయకుడు అంటూ ఎవరూ లేరు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో తెలియడం లేదు. లోకేష్ కు పటిష్టమైన టీం ఉంది అక్కడ. ఆపై విపరీతమైన ప్రజాధరణం ఉంది. మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో డీఎస్సీ 2025 పై లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ ప్రజాతీర్పు కోరుకుంటే వైసీపీకి కోలుకోలేని దెబ్బ ఖాయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంగళగిరిలో కనీసం డిపాజిట్లు తెచ్చుకునే స్థితిలో లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే అనవసరంగా లోకేష్ ను కెలికి ఇబ్బందులు తెచ్చుకోవడం ఎంత మాత్రం సహేతుకం కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి. కేవలం రాజకీయ కోణంలో ఏదో చేసేస్తాం.. ఏదో ఆశించి లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేస్తే జరిగేది ఇదే.
* మరో డీఎస్సీ అస్త్రం..
పోనీ డీఎస్సీ 2025 అక్రమాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తోంది. కనీసం నియోజకవర్గానికి 10 మంది డిఎస్సీ అభ్యర్థులను పోగు చేయలేకపోతోంది. ఇప్పటికే అభ్యర్థులు దీనిని పెద్దగా నమ్మడం లేదు. ఆపై బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు లోకేష్. త్వరలో అంటే అక్టోబర్ లో డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు. దీంతో ఈ రాజకీయ గొడవలు ఎందుకు అని.. డీఎస్సీ ప్రిపరేషన్ లో అభ్యర్థులంతా మునిగిపోయారు. శిక్షణలో మునిగితేలుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి ఉండి.. డీఈడీ పూర్తి చేసిన ఒకరిద్దరూ అభ్యర్థులు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఇది ఆ పార్టీకి వృధా ప్రయాస మాత్రమే.
* ముప్పు తిప్పలు..
లోకేష్ ను కెలికితే కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టమే. 1978 నుంచి కడప జిల్లాతో పాటు పులివెందులలో తన మార్కు చూపిస్తూ వస్తోంది వైఎస్సార్ కుటుంబం. రాయలసీమ రాజకీయాలనే శాసించింది ఆ ఫ్యామిలీ. చంద్రబాబు తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ ఫ్యామిలీని టచ్ చేయలేకపోయారు. అటువంటిది లోకేష్ వచ్చి ఆ ఫ్యామిలీని ఎంతగా హైరానా పడేలా చేశారు తెలియంది కాదు. చివరకు భారతి సిమెంట్స్ ను సైతం ముయించారు అంటే లోకేష్ గడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి లోకేష్ ను అనవసరంగా కెలికి వైసిపి కష్టాలు తెచ్చుకోవడం కంటే మూర్ఖత్వం ఉండదు..