Tadepalligudem: గణపతికి ఐదు రోజులపాటు పూజలు చేశారు. నిమజ్జనం చేయాలి అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. డీజే శబ్దాలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. కానీ ఇంతలోనే అనుకోని దారుణం చోటుచేసుకుంది. నిమజ్జనం కాస్త విషాదాంతమైంది.
రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జనం సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనం నేపథ్యంలో పట్టణంలోని భక్తులు.. యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజె సౌండ్ ఏర్పాటు చేసుకున్నారు. నచ్చిన పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ డ్యాన్స్ చేస్తున్న యేసు అనే వ్యక్తి ఒక్కసారిగా ఒక పగిలిపోయాడు. చూస్తుండగానే కింద పడిపోయాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే అతడు చనిపోయాడు.
ఈ ఘటనతో ఆ నిమజ్జన వేడుకల వద్ద ఒక్కసారిగా విషాద వాతావరణం ఏర్పడింది. ఉత్సవాలు ఆనందంగా సాగుతున్న నేపథ్యంలో ఊహించని విషాదం చేసుకోవడాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. డిజె సౌండ్ ఎక్కువగా ఉండడం వల్లే ఏసు గుండె ఆగిపోయిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే శబ్దం వల్ల ఆగిపోయిందా.. గతంలో ఆయనకు ఏదైనా హృదయ సమస్య ఉందా.. అనేది తెలియాల్సి ఉంది. కాగా, ఏసు గుండెపోటుతో కుప్పకూలిపోతున్న దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న మనిషి.. ఉత్సాహంగా డ్యాన్స్ వేసిన మనిషి అలా కుప్పకూలిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మనుషుల సాధారణ వినికిడి రక్షణ కోసం 80 డేసి బెల్స్ వద్ద వారానికి 40 గంటల పాటు వినడం మంచిది. 90 డేసి బెల్స్ వద్ద అది సుమారు నాలుగు గంటలకు.. 100 డేసి బెల్స్ వద్ద 20 నిమిషాలకు తగ్గింది. 85 డేసిబెల్స్ అనేది ముఖ్యమైన హెచ్చరిక స్థాయి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది. డీజే శబ్దాలు గుండె మీద నేరుగా ప్రభావం చూపిస్తాయని గతంలో అనేక అధ్యయనాల ద్వారా తెలిసింది. వైద్యులు కూడా ఆ స్థాయిలో శబ్దాలు పెట్టుకుని డ్యాన్సులు చేయడం వల్ల గుండె పై ప్రభావం చూపిస్తుందని..అందువల్ల ఆ శబ్దాల తీవ్రతను తగ్గించుకోవాలని వైద్యలు చెబుతున్నారు. వినాయక నిమజ్జన వేడుకల్లో ఇటీవల కాలంలో డీజే సౌండ్ లు పెట్టుకుని డ్యాన్సులు చేయడం పరిపాటిగా మారింది. దీనివల్ల డ్యాన్సులు వేసే వారికి ఉత్సాహం ఉంటుందేమో గాని.. ఆ శబ్దం తీవ్రత కలిగించే ఇబ్బంది మాములుగా ఉండదు.
తాడేపల్లిగూడెంలో తీవ్ర విషాదం.. డీజే సౌండ్ కు ఆగిన గుండె!
తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి
వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే సౌండ్, మెగాస్టార్ చిరంజీవి గారి పాటకు ఉత్సాహంగా డాన్స్ వేస్తూ కాకర్లమూడి ఏసు (48) గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. pic.twitter.com/v2lZ7YuiIJ
— RTV (@RTVnewsnetwork) September 20, 2026