Homeఆంధ్రప్రదేశ్‌Ambati Rambabu : అంబటి రాంబాబు "రాయల్ సెల్యూట్".. జగన్ ప్రెసిడెంట్ మెడల్ కు దండం

Ambati Rambabu : అంబటి రాంబాబు “రాయల్ సెల్యూట్”.. జగన్ ప్రెసిడెంట్ మెడల్ కు దండం

Ambati Rambabu : అంబటి రాంబాబు విలేకరుల ముందుకు వచ్చి ఏదైనా మాట్లాడితే సోషల్ మీడియాలో మంటలు చాలా రేగుతాయి. ఆయన మాట్లాడిన మాటలు కావలసిన వాళ్లకు కావాల్సిన స్టఫ్ ఇస్తాయి. ఆయన వ్యాఖ్యలకు లోతైన అర్ధాలు సృష్టించి మీమర్స్ పండగ చేసుకుంటారు. తాజాగా అంబటి రాంబాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది కేవలం వార్తలకే కాదు.. సోషల్ మీడియాకు మంచి విందు భోజనం లాగా మారింది. ఆయన చేసిన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో […]

Ambati Rambabu : అంబటి రాంబాబు విలేకరుల ముందుకు వచ్చి ఏదైనా మాట్లాడితే సోషల్ మీడియాలో మంటలు చాలా రేగుతాయి. ఆయన మాట్లాడిన మాటలు కావలసిన వాళ్లకు కావాల్సిన స్టఫ్ ఇస్తాయి. ఆయన వ్యాఖ్యలకు లోతైన అర్ధాలు సృష్టించి మీమర్స్ పండగ చేసుకుంటారు.

తాజాగా అంబటి రాంబాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది కేవలం వార్తలకే కాదు.. సోషల్ మీడియాకు మంచి విందు భోజనం లాగా మారింది. ఆయన చేసిన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోయిన తర్వాత ప్రతిరోజు 90ఎంఎల్ రాయల్ సెల్యూట్ విస్కీ తాగుతున్నానని రాంబాబు స్వయంగా చెప్పారు. ఆ విషయం అత్యంత ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి రాయల్ సెల్యూట్ అనేది ప్రీమియం బ్రాండ్. ఈ విస్కీని ప్రీమియం వ్యక్తులు మాత్రమే తాగుతారు. దీని ఫుల్ బాటిల్ ధర దాదాపు 20 వేలకు పైగా ఉంటుంది. 21 ఇయర్స్ వంటి ప్రీమియం వేరియంట్ లాగానే దీని ధర కూడా ఉంటుంది.

అంబటి రాంబాబు 90ml వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ లేపి వదిలిపెడుతున్నాయి. అంబటి రాంబాబు చెప్పిన లెక్క ప్రకారం రోజుకు 90 ఎంఎల్ తీసుకుంటే నెలకు 2.7 లీటర్లు. అంటే ఏడాదికి 32.85 లీటర్లు.. ఒకవేళ వాటిని బాటిల్స్ లోకి గనక మార్చితే 47 బాటిల్లు అవుతాయి. ఒక్కో బాటిల్ ధర 20,000 అనుకుంటే ఏడాదికి ఖర్చు 9.4 లక్షలు. ఏపీలో బాటిల్ ధర వేరియంట్.. కాలం.. పన్నుల ఆధారంగా ధర మారొచ్చు. ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేదు కాబట్టి ఓదార్పు కోసం ప్రీమియం బ్రాండ్ రాంబాబు ఎంచుకున్నారని.. పోలవరం లాంటి డిఫికల్ట్ ప్రాజెక్టు గురించి అధ్యయనం చేసి చేసి ఆయన ఓడిపోయారని.. ఇప్పుడు రాయల్ విస్కీ ఆయనకు ఉపశమనం కలిగిస్తోందని టిడిపి నేతలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ మెడల్ మాత్రమే దొరికేదని.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాంబాబు కోరుకున్న బ్రాండ్ దొరుకుతోందని టిడిపి నాయకులు అంటున్నారు. వైసిపి ఓడిపోయింది కాబట్టి అంబటి రాంబాబుకు రాయల్ సెల్యూట్ లభించింది. ఎప్పుడంటే అప్పుడు తాగే అవకాశం కలుగుతోంది. ఒకవేళ వైసీపీ గనుక అధికారులకు వచ్చి ఉంటే ప్రెసిడెన్షియల్ మెడల్ దిక్కయ్యేదని టిడిపి నేతలు అంటున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో ప్రీమియం బ్రాండ్లు దొరికేవికావు. చివరికి డైలీ గా తాగే బ్రాండ్లు కూడా లభించేది కాదు. ఏదో మామూలు కంపెనీకి సంబంధించిన మద్యం మాత్రమే లభించేది. ఆ మద్యం తాగి చాలామంది అనారోగ్యం పాలయ్యారు. కొంతమంది చనిపోయారు కూడా. ఇదే విషయాన్ని టిడిపి నేతలు ఎన్నికల సమయంలో ప్రచార అస్త్రంలాగా వాడుకున్నారు. చివరికి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో మందుబాబులు కోరుకున్న బ్రాండ్లు అందుబాటులో ఉండేలా చేస్తామని చెప్పారు అంటే ఏపీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ఇచ్చిన హామీ మందుబాబులకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు గానీ.. అంబటి రాంబాబు శిరోభారం మాత్రం తగ్గుతోంది. అది కూడా రాయల్ సెల్యూట్ సాక్షిగా..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper