Telangana news: తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ వ్యాపారవేత్త సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఎప్పుడు చర్చకు దారి తీస్తోంది. తనకు సంబంధించిన వ్యాపార సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో.. ముఖ్యనేతకు సంబంధించిన అత్యంత సన్నిహితుడిగా భావించే ఒక వ్యక్తి నుంచి తనకు ఊహించని సూచన ఎదురయిందని.. ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది.” నేను నా సమస్య గురించి మాట్లాడేందుకు ఆయనను సంప్రదిస్తే.. గెస్ట్ హౌస్ కు రమ్మని నన్ను నేరుగా కోరారు” అంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అధికార వర్గాల్లో.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ ముఖ్య నాయకుడికి అత్యంత సన్నిహితుడా? ఇది పూర్తిగా నిజమేనా? ఆ మహిళా పారిశ్రామికవేత్త తన వ్యాపార సమస్యను చెప్పడానికి ప్రయత్నించినప్పుడు.. అధికారిక విధానం కాకుండా గెస్ట్ హౌస్ కు రమ్మని పిలిచారా? ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే..
ప్రకటనల విభాగంలో వ్యాపారం
ఓ మహిళ వ్యాపారవేత్త.. ప్రకటనల విభాగంలో వ్యాపారం చేస్తున్నారు. గడచిన మూడు సంవత్సరాలుగా ఆమె చట్టబద్ధమైన వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు.. సాధారణంగా టెండర్లు పిలిచే వరకు తాత్కాలిక అవకాశాలు కల్పించాలని.. రెవెన్యూ షేరింగ్ విధానంలో ప్రతిపాదనలు కూడా ఆమె సమర్పించారు. కొన్ని ప్రకటనల నిర్మాణాలపై ఆమె సదరు ముఖ్య నేత అనుచరుడి దృష్టికి తీసుకెళ్లారు. ప్రకటన నిర్మాణాలపై మాట్లాడే క్రమంలో గెస్ట్ హౌస్ కు రావాలని ముఖ్య నేత అనుచరుడు కోరడంతో ఆమె ఇబ్బంది పడ్డారు. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో బయటపడ్డారు.
అనేక విషయాల ప్రస్తావన
సోషల్ మీడియా పోస్టులో ఆమె ప్రస్తావించినట్టు హైదరాబాదు నగరంలో అవుట్ డోర్ అడ్వర్టైజింగ్ కు సంబంధించిన జీవో ఎంఎస్ నంబర్ 685 తెలంగాణ హైకోర్టు రికార్డుల్లో కూడా ప్రస్తావన ఉంది. అందులో ఉన్న నిబంధనల ప్రకారం భూమి నుంచి 15 అడుగులకు మించిన ఎత్తులో ఉన్న కొన్ని ప్రకటనల నిర్మాణాలపై పరిమితులు విధించారు. అయితే ఆ మహిళా వ్యాపారవేత తన పోస్టులో ప్రస్తావించిన నిర్దిష్టమైన నిర్మాణాలు.. వాటికి సంబంధించిన అనుమతులు లేదా మినహాయింపులపై పూర్తి అధికారిక రికార్డులు బహిరంగంగా ధ్రువీకరించాల్సిన అవసరం ఉంది..
ఆ వ్యక్తి పేరును బహిరంగంగా వెల్లడించలేదు
ఆ మహిళా వ్యాపారవేత్త తన సోషల్ మీడియా పోస్టులో ఆ వ్యక్తి పేరును బహిరంగంగా వెల్లడించలేదు.. ఆ ముఖ్య నేత ఆ మహిళా వ్యాపారవేత్తను గెస్ట్ హౌస్ కు ఆహ్వానించడం వెనక సాధారణ సమావేశం అనే కోణం ఉందా లేదా అధికారిక వ్యవస్థకు వేలుపల వ్యక్తిగతంగా కలవాలి అనే ఉద్దేశమా.. దీనిపై ప్రస్తుతం మహిళా వ్యాపారవేత్త చేసిన ఆరోపణ తప్ప మరింత స్పష్టమైన ఆధారం బహిరంగంగా కనిపించడం లేదు. అయితే ఆ మహిళా వ్యాపారవేత్త తనకు ఎలాంటి ప్రత్యేక సిఫారసు అవసరం లేదని చెబుతోంది.
ప్రభుత్వం నుంచి సరైన క్లారిటీ వస్తే..
చట్టబద్ధమైన అవకాశం.. సమానమైన ప్రాధాన్యం.. ఆత్మగౌరవంతో వ్యవహరించే విధానం కావాలని కోరుతున్నారు. అంతేకాదు బహిరంగ వేదికపై ఎవరి పేర్లు తాను ప్రస్తావించదల్చుకోలేదని.. వ్యక్తిగత ఆరోపణలు చేయదల్చుకోలేదని.. అది తన ఉద్దేశం కాదని ఆమె చెబుతోంది. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందిస్తుందా.. ఆమెను గెస్ట్ హౌస్ గ్రామానికి ఓరిని ఆ వ్యక్తి ఎవరో ప్రభుత్వం బయట పెడుతుందా.. ఆ వ్యక్తికి ప్రభుత్వంతో లేదా ముఖ్య నేత కార్యాలయంతో ఏదైనా అధికారికంగా సంబంధం ఉందా.. అవుట్ డోర్ అడ్వర్టైజింగ్ కు సంబంధించిన నిబంధనలు అందరికీ సమానంగానే అమరవుతున్నాయా.. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సరైన క్లారిటీ వస్తే బాగుంటుంది.
మహిళా వ్యాపారవేత్తని గెస్ట్ హౌజ్ కి రమ్మన్న వ్యక్తి ఎవరు ?
పైగా సీఎం కి అత్యంత సన్నిహితుదైన ఆ వ్యక్తిపై చర్యలుంటాయా ?
శోభా రెడ్డి అనే అవుట్ డోర్ అడ్వర్టయిజ్మెంట్
కంపెనీ యజమాని బిజినెస్ ప్రపోజల్ తో వెళ్తే ఎదురైన పరిస్థితి ఇది ..ట్విట్టర్ లో ఆమె పెట్టిన పోస్ట్ ఇక్కడ… pic.twitter.com/OkDMrfjESF
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) September 20, 2026