Kalvakuntla Kavitha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో కవిత సమర శంఖం పూరించారు. ఆదివారం కొడంగల్ వేదికగా జరిగిన పాంచ జన్య సంకల్ప సభలో కవిత ఓపెన్ గా మాట్లాడారు. ఎటువంటి ఫిల్టర్లు లేకుండా తన అభిప్రాయాన్ని.. మొహమాటం లేకుండా చెప్పేశారు.
నేను వాళ్ళు వదిలిన బాణం.. వీళ్ళు వదిన బాణం కాదు. అలాంటి తలకాయ లేని మాటలు మాట్లాడను. అలాంటి వారి కోసం నేను కొడంగల్ గడ్డమీద నుంచి చెబుతున్న. ఇప్పటికీ అధికారానికి.. విద్యకు దూరంగా ఉన్న మా బహుజనుల బాణాన్ని నేను. యువకుల యుద్ద నినాదాన్ని నేను. వారికోసం మోడీతో కొట్లాడుతా. రేవంత్ రెడ్డితో కొట్లాడుతా. చివరికి కేసీఆర్ తో నైనా కొట్లాడుతా. తద్వారా తన మీద వస్తున్న విమర్శలకు ఈ స్థాయిలో కవిత సమాధానం చెప్పారు. అంతేకాదు తనమీద అవాకులు చవాకులు పేరుతున్న గులాబీ పార్టీ సోషల్ మీడియా.. ఆ పార్టీ అనుబంధ సోషల్ మీడియా గ్రూపులకు కవిత గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
వాస్తవానికి కవిత పాంచ జన్య సభలో గట్టిగా మాట్లాడారు. ఒక రకంగా దీనిని ఎన్నికల సభ లాగా ఆమె చాలెంజ్ గా తీసుకొని ప్రసంగించారు.. ప్రారంభం నుంచి చివరి దాకా బహుజనుల విషయాలను ప్రస్తావించారు. తన తండ్రి పరిపాలన కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదని. ముఖ్యంగా విద్య.. వైద్యం.. ఇతర వాటిల్లో వృద్ధి కనిపించలేదని కవిత క్లారిటీ ఇచ్చారు. విద్య.. వైద్యం వంటివి తమ ప్రధమ ప్రాధాన్యాలు అని కవిత క్లారిటీ ఇచ్చారు. అక్కడితోనే ఆగిపోలేదు.. ఇంకా చాలా విషయాలను కవిత ఈ సభలో చెప్పారు. తన తండ్రి పరిపాలన కాలంలో జరిగిన అవినీతిని.. అక్రమాలను.. తనను బయటికి పంపించిన విధానాన్ని ఆమె వివరించారు.
ఇటీవల తన అత్తగారిల్లు అయిన నిజామాబాదులో పాంచ జన్య సభను నిర్వహించిన కవిత.. అక్కడ కన్నీళ్లు పెట్టుకున్నారు. సభలో మాట్లాడుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కొడంగల్ లో మాత్రం ధైర్యంగా మాట్లాడారు. ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన ఆమె.. చివరికి తన తండ్రిని కూడా వదిలిపెట్టలేదు. అన్నిటికంటే ముఖ్యంగా గులాబీ పార్టీ సోషల్ మీడియాకు దిమ్మతిరిగిపోయేలాగా కవిత రిప్లై ఇచ్చింది. ఒక రకంగా దానిని స్లిప్పర్ షాట్ అని చెప్పవచ్చు. కొద్దిరోజులుగా గులాబీ పార్టీ సోషల్ మీడియా కవిత మీద వ్యక్తిగతంగా దాడి చేసే స్థాయిలో విమర్శలు చేస్తోంది. ఆ విమర్శలకు కవిత ఏర్పాటుచేసిన సోషల్ మీడియా గ్రూపులలో కౌంటర్ ఇస్తున్నప్పటికీ.. గులాబీ పార్టీ సోషల్ మీడియా ఆగడం లేదు. అందువల్లే కొడంగల్ సభ నుంచి కవిత గట్టిగా రిప్లై ఇచ్చారు. మరి దీనికి గులాబీ పార్టీ సోషల్ మీడియా ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.
నేను వాళ్లు వదిలిన బాణం.. వీళ్లు వదిలిన బాణం అని తలకాయ లేని మాటలు మాట్లాడే వాళ్లకు కొడంగల్ గడ్డ మీద నుంచి చెప్తున్న ఇప్పటికీ అధికారానికి విద్యకు దూరంగా ఉన్న మా బహుజనల బాణాన్ని నేను.. యువకుల యుద్ధ నినాదాన్ని నేను
వారి కోసం మోదీతో అయినా రేవంత్ రెడ్డితో అయినా కేసీఆర్ తో అయినా… pic.twitter.com/RkYyNeIcMP
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 20, 2026