Ambati Rambabu: ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం.. వైసీపీలో కీలక నాయకుడు అంబటి రాంబాబు కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీస్ అందుకున్నారు . ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చర్చనీయాశంగా మారింది. ఎయిర్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణకు హాజరుకావాలని ఆయనకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ఇచ్చిన ఆదేశాలలో సెప్టెంబర్ 11న విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ నోటీసు తనకు సెప్టెంబర్ 18 అందిందని.. గడువు ముగిసిన తర్వాత నోటీసు అందిన నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాదనని అంబటి చెప్తున్నారు.
తర్వాత ఏం జరుగుతుంది
పాత నోటీసులో ఉన్న తేదీ ముగిసిపోయిన నేపథ్యంలో.. మరో తేదీతో సమన్లు ఇచ్చే అవకాశం ఉంది. తాజా నివేదిక ప్రకారం సెప్టెంబర్ 24న హాజరుకావాలని ఈడి అధికారులు సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ రాలేదు. అయితే తుది తేదీని అధికారిక సమన్ల ద్వారానే నిర్ధారించాల్సి ఉంటుంది.
ఏ అంశాల మీద ప్రశ్నిస్తారంటే
గత వైసిపి ప్రభుత్వం లో జరిగిన మద్యం రవాణా వ్యవహారంలో ఈడి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. ఇంకా కొంతమంది నాయకుల మీద దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో అంబటి రాంబాబు పాత్ర.. ఇతర వ్యక్తులతో ఆయనకున్న సంబంధాలు.. ఆర్థిక లావాదేవీలు.. ఇతర అంశాల మీద కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు వివరణ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. నోటీసులు జారీ చేసినతమాత్రాన అంబటి రాంబాబు తప్పు చేసినట్టు కాదని ఆయన అనుచరులు అంటున్నారు . విచారణలో ఎటువంటి ఆధారాలు బయటపడతాయో చూడాల్సి ఉందని ఆయన అనుచరులు అంటున్నారు.
లిక్కర్ వ్యాపారంతో తనకు సంబంధం లేదని ఇప్పటికే అనేక సందర్భాలలో అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చారు. విచారణకు సహకరిస్తానని కూడా ఆయన వెల్లడించారు. రాజకీయ కక్షతోనే తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులను ఉసిగొలిపారని రాంబాబు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను టిడిపి నేతలు ఇప్పటికే ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏపీలో మద్యం కుంభకోణం జరిగింది కాబట్టే విచారణ జరుపుతున్నాయని టిడిపి నేతలు అంటున్నారు.
ఎందుకు అంబటి పేరు..
మద్యం కుంభకోణం వ్యవహారంలో అధికారులు మర్రి సుబ్బారెడ్డిని విచారించారు. ఆ సమయంలో అంబటి రాంబాబు పేరు చెప్పాలని ఒత్తిడి చేశారని.. పొరపాటున ఆయన అంబటి పేరు చెప్పారని రాంబాబు అనుచరులు అంటున్నారు.. అయితే దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు ఇంతవరకు స్పందించలేదు. తాము అన్ని విషయాలు ధ్రువీకరించుకున్న తర్వాతే దర్యాప్తు చేస్తామని.. వ్యక్తుల మీద రాజకీయ కక్షలతో తాము విచారణ నిర్వహించలేమని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు అంటున్నారు..
అంబటిని ఈడి ఎందుకు పిలిచింది అనే ప్రశ్న కంటే విచారణలో ఏ ఆధారాలను అంబటి ముందు ప్రదర్శిస్తుంది.. దానికి ఆయన ఏ విధంగా వివరణ ఇస్తారు.. ఆ తర్వాత ఈడి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది.. ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది.