Sarfaraz Khan: టీమిండియా క్రికెట్లో చోటు దక్కించుకోవాలంటే ఆటగాళ్లు సన్నగా కరెంట్ తీగలా ఉండాలి. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతూ ఉండాలి. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ఉండాలి. అద్భుతంగా బౌలింగ్ వేస్తూ ఉండాలి. ఇక ఫీల్డింగ్ విషయంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పాలి. ఇటీవల వైట్ బాల్ ఫార్మాట్లో.. అంతకు ముందు రెడ్ బాల్ ఫార్మాట్లో వరుసగా ఓటములు ఎదుర్కోవడంతో మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
టీమిండియాలో అందరూ కరెంట్ తీగ లాంటి ఆకృతిని కలిగి లేరు. కొందరు లావు గా ఉన్నారు. అటువంటి వారిలో సర్ప రాజ్ ఖాన్ ఒకడు.. ఇతడు లావుగా ఉంటాడు. ముంబై జట్టుకు కీలకమైన ఆటగాడిగా ఉండేవాడు. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించడంతో.. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం స్వదేశం వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా టీమిండియాలోకి ప్రవేశించాడు. వచ్చిన అవకాశాలను దాదాపుగా సద్వినియోగం చేసుకున్నాడు. అయితే అతని బరువు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో డైట్ కంట్రోల్ చేయాలని.. సామర్థ్యాన్ని పెంచుకోవాలని మేనేజ్మెంట్ సూచించింది.
అప్పటినుంచి ఖాన్ తన లైఫ్ స్టైల్ మొత్తం మార్చేసుకున్నాడు. కఠినమైన వ్యాయామాలు చేయడం మొదలుపెట్టాడు. చివరికి ఇటీవల ముంబైలో వర్షాల వల్ల ప్రాక్టీస్ చేసే వీలు లేకపోవడంతో ఏకంగా కాశ్మీర్ వెళ్లిపోయాడు. అక్కడ శిక్షణ తీసుకుంటూ మొత్తంగా 17 కిలోల బరువును తగ్గేసాడు. నెట్ బౌలర్లు.. జమ్ము కాశ్మీర్ రాష్ట్ర క్రికెటర్లతో కలిసి రోజు గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. ఎర్ర మట్టి మైదానాల మీద స్పిన్ బౌలింగ్ ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేసేవాడు. తన లోపాలను సవరించుకునేవాడు. అందువల్లే ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు. గతంలో అతడు 80 కిలోల బరువు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్యను 63 కి తగ్గించుకున్నాడు.
భోజనంలో అన్నాన్ని పూర్తిగా తగ్గించాడు. కూరగాయలు.. ప్రోటీన్ అందించే దినుసులు.. వంటి వాటిని తీసుకోవడం మొదలుపెట్టాడు. చక్కెర పదార్థాలకు.. జంక్ ఫుడ్ కు దూరం జరిగాడు. ఫలితంగా ఏకంగా 17 కిలోల బరువు తగ్గి.. కరెంట్ తీగలా కనిపిస్తున్నాడు. బ్యాటింగ్లో సరికొత్తగా దర్శనమిస్తున్నాడు. మరి ఇతడికి గౌతమ్ గంభీర్ చోటు కల్పిస్తాడా.. ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభించనుంది.