Vijaya Sai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త మార్పుకు నాంది పలుకుతున్నట్టు ఇటీవల మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. కొత్తగా పార్టీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆయన ప్రకటన ఏపీ రాజకీయాలలో సరికొత్త చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఆయన పదే పదే ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవం.. పౌరుషాన్ని కాపాడే విధంగా పార్టీ ఏర్పాటు చేస్తానని చెబుతున్న వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఇదే సమయంలో అన్ని కులాలను.. మతాలను గౌరవించే విధంగా తన పార్టీ ఉంటుందని ఆయన చెబుతున్నారు.
విజయసారెడ్డి ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం చరిత్ర మీద.. పరిణామాల మీద 350 పేజీల పుస్తకాన్ని రచించినట్టు వెల్లడించారు. అదే కాదు తన కొత్త రాజకీయ వేదిక సామాజిక గుర్తింపు.. రాయలసీమ అభివృద్ధి.. యువత.. ఉపాధి వంటి అంశాలను కలిపి ముందుకు తీసుకెళుతున్నట్టు ఆయన ప్రకటించడం సంచలనంగా మారింది.
ఒరిజినల్ రెడ్లు అనే పదప్రే గాని ఆయన పదేపదే వ్యక్తికరించడం వైసిపి వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు వైయస్ జగన్కు ఉన్న సాంప్రదాయ రాజకీయ సామాజిక ఆధారాన్ని ప్రభావితం చేసే విధంగా విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. విజయ్ సాయి రెడ్డి జగన్ విధానాలను మాత్రమే తప్పుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తను పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నడు కూడా ప్రకటించలేదు. టిడిపి.. వైసిపికి ప్రత్యామ్నాయంగా మూడవ రాజకీయ శక్తి గానే తాము ఏర్పాటు కాబోతున్నట్టు ఆయన వెల్లడిస్తున్నారు.
విజయసాయిరెడ్డి ఒరిజినల్ రెడ్లు అనే రాజకీయ నినాదాన్ని ఎంతవరకు విస్తృతంగా తీసుకెళ్తారు.. సామాజికంగా.. రాజకీయంగా ఉద్యమం లాగా ఎలా మలుస్తారు.. ఇదే సమయంలో రాయలసీమ అభివృద్ధికి ఎంత మాత్రం తోడ్పాటు అందించగలుగుతారు.. అక్కడి యువతకు ఏ స్థాయిలో ఉపాధి అవకాశాలు అందించగలుగుతారు అనే అంశాలతో ఓటు బ్యాంకు ను స్థిరీకరించుకోగలుగుతారా.. అధికారంలోకి రాగలుగుతారా.. అనే ప్రశ్నలకు రాబోయే రోజులు తేల్చాల్సి ఉంది. ఇప్పటికే విజయ సాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన ఏపీ రాజకీయాలలో టిడిపికి.. వైసీపీకి.. ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో.. ఆయన వేసే అడుగులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాయలసీమపై ప్రత్యేక ఫోకస్.. రెడ్డి సామాజిక వర్గ ఆత్మగౌరవం అనే అంశాల చెట్టు విజయసాయిరెడ్డి తిరుగుతున్న నేపథ్యంలో.. ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన గేమ్ చేజర్ అవుతారని ఆంధ్రప్రదేశ్ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.