Vijay Sai Reddy: వైసీపీలో ఒకప్పుడు రెండో స్థానంలో కొనసాగిన విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటికి వచ్చారు. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో పార్టీలో తనకి ఎదురైన అవమానాలను ఆయన బయట పెట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా కూడా ఆయన సంచలన విషయాలను వెల్లడించారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది నేతలను పదవుల కోసం మతమార్పిడులకు పాల్పడే విధంగా జగన్ ఒత్తిడి తీసుకొచ్చారట. పైగా కొంతమంది నాయకులు ఎమ్మెల్యే టికెట్ల కోసం.. మంత్రి పదవుల కోసం మతం మారారట.. గతంలో కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టికెట్ కోసం సువార్త కూటముల్లో ఒక ప్రసంగం చేశారట. ఆ వీడియోను విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దీనికి జగన్ బదులు ఇవ్వాలని నేరుగా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు..
అసలైన విషయాన్ని బయటపెట్టారు
నాడు జరిగిన సువార్త కూటములో క్రైస్తవ మతం విపరీతంగా విస్తరించాలని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. క్రైస్తవ మతానికి జగన్ సహకారం అందిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై జనసేన.. భారతీయ జనతా పార్టీ.. కాంగ్రెస్ పార్టీ.. వామపక్షాలు ఈ వ్యవహారం మీద తమ అభిప్రాయాన్ని బయటపెట్టాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. కేవలం దీనిని ఒక వీడియో లాగా మాత్రమే విజయసాయిరెడ్డి బయట పెట్టలేదు. పార్టీ కేటాయించిన టికెట్లు.. మంత్రి పదవులు పొందినవారు.. ఇతర వ్యవహారాల వెనుక మతమార్పిడులు జరిగాయని విజయసాయిరెడ్డి అసలైన విషయాన్ని బయటపెట్టారు. చాలామంది నాయకులు తమ మతాన్ని మార్చుకున్నారని.. మంత్రి పదవుల కోసం అడ్డగోలుగా వ్యవహరించాలని.. వారంతా కూడా ఇప్పుడు సమాధానం చెప్పాలని విజయ సాయి రెడ్డి ప్రశ్నించారు అదే కాదు ఈ వ్యవహారం మీద సమాధానం చెప్పాలని నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఆయన నిలదీయడం దుమారాన్ని రేపుతోంది.. జగన్ హయాంలో మతమార్పిడులు జరిగాయని.. విజయశాంతి ఆరోపిస్తున్న తీరు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలనగా మారింది.
జోగి రమేష్ మీద..
జోగి రమేష్ మీద ఇటీవల అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. చివరికి ఆయన కోడలు కూడా రమేష్ మీద ఆరోపణలు చేసింది. ఇంట్లో పూజలు చేయనిచ్చేవారు కాదని.. దేవుడి పటాలను పక్కన పెట్టే వారిని.. ఇంకా అనేక రకాలుగా ఆమె జోగి రమేష్ కుటుంబం మీద ఆరోపణలు చేసింది. అంతేకాదు, జోగి రమేష్ మాత్రం కూడా మార్చుకున్నాడని ఆరోపించింది. ఈ లెక్కన విజయ సాయి రెడ్డి పోస్ట్ చేసిన వీడియో ప్రకారం చాలామంది మతం మార్చుకున్నట్లు తెలుస్తోంది. మతం మార్పిడి చేసుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలను ఎవరినీ వదిలిపెట్టలేదని.. అందర్నీ ఆ దిశగా ప్రోత్సహించారని విజయసాయిరెడ్డి పోస్ట్ చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీడియో ద్వారా తెలుస్తోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ, సీనియర్ ఎమ్మెల్యే 2024 ఎన్నికల ముందు చేసిన ఈ ప్రసంగంపై రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు–భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తదితర రాజకీయ పార్టీలు తమ స్టాండ్ స్పష్టం చేయాలని కోరుతున్నా.
అంతేకాకుండా, గతంలో… pic.twitter.com/VdIy0KQ5fq— Vijayasai Reddy V (@VSReddy_MP) September 16, 2026