ASHA Workers:40 సంవత్సరాలు వచ్చినా మగ పిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదు. ఆడపిల్లలు ఒక పట్లగా లేరు. వాళ్లకు రిక్వైర్మెంట్లు పెరిగిపోయాయి. మేము రోజు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ను హాస్పిటల్ తీసుకెళ్లాలి. వాళ్ల వివరాలు నమోదు చేయించాలి. అలా చేస్తేనే మాకు జీతం ఇస్తారు. మాకు టార్గెట్లు ఉంటాయి. అవి కచ్చితంగా పూర్తి కావాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాలి..
ఇవీ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఆశ వర్కర్ చేసిన కామెంట్స్. ఈ వీడియో సరికొత్త చర్చకు కారణమవుతోంది. ఆశ వర్కర్ చేసిన కామెంట్స్ సమాజంలో పరిస్థితికి అద్దం పడుతున్నాయి. వాస్తవానికి ఆ వర్కర్ చేసిన వ్యాఖ్యలు వివాహాలు.. కుటుంబ జీవితం.. వృత్తిపరంగా ఎదురవుతున్న వ్యక్తిగత సమస్యల గురించి మాట్లాడినట్టే అనిపించినప్పటికీ.. నేటి కాలంలో మారిన పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇప్పటికాలంలో యువత సకాలంలో పెళ్లిలు చేసుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇదే వాతావరణం ఉంది. చదువు.. ఉద్యోగం.. కెరియర్ వీటి చుట్టూ చాలామంది యువత పరిభ్రమిస్తున్నారు. ఫలితంగా వివాహం చేసుకోవడాన్ని వారు దాటవేస్తున్నారు. పైగా వివాహ వ్యవస్థ నేటి కాలంలో తీవ్రమైన ఒడిదుడుకులకు ఎదురవుతున్న నేపథ్యంలో చాలామంది పెళ్లిళ్లు చేసుకోకుండా అలానే ఉండిపోతున్నారు. సహజీవనం చేస్తూ.. నచ్చిన మనిషితో నచ్చినంత కాలం ఉంటున్నారు. ఆ తర్వాత కటీఫ్ చేసుకుంటున్నారు.
పైగా నేటి కాలంలో చాలామంది యువకులకు సరైన జోడు దొరకడం లేదు. అమ్మాయిల సంధ్య కూడా తగ్గిపోవడంతో యువకులకు వివాహాలు జరగడం లేదు. దీంతో బ్రహ్మచారులు గానే మిగిలిపోతున్నారు. ఆడపిల్లలు కూడా అంత ఈజీగా వివాహాలు చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. వారికి కూడా రిక్వైర్మెంట్లు పెరిగిపోతున్నాయి. అందువల్లే నేటి కాలంలో చాలామందికి 40 సంవత్సరాలు వచ్చినప్పటికీ పెళ్లిళ్లు కావడం లేదు. అందువల్లే తమ టార్గెట్లు పూర్తిగా ఇవ్వడం లేదని ఆశ వర్కర్ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆశ వర్కర్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రజలకు ఆరోగ్య సేవ అందిస్తారు. ఆరోగ్య సేవలు మీద అవగాహన కూడా కల్పిస్తుంటారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో కీలకంగా పనిచేస్తారు. గర్భిణులకు.. చిన్నారులకు.. కుటుంబ నియంత్రణ.. పారిశుద్ధ్యం వంటి అంశాల మీద అవగాహన కల్పిస్తారు. అయితే గర్భిణీలను ప్రతిరోజు పర్యవేక్షించే బాధ్యత పేరు మీద ఉంటుంది. గర్భిణి వివరాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీరు నమోదు చేయించాలి. అలా చేస్తేనే వీరికి ప్రభుత్వం వేతనం ఇస్తుంది. టార్గెట్ పూర్తిగా పోతే అధికారుల నుంచి వీరికి ఇబ్బందులు తప్పవు.
View this post on Instagram