AK63 – Ajith : ఏకే 63.. అజిత్ నెక్స్ట్ మూవీ కోసం అభిమానుల హంగామా..!!

తాజాగా అజిత్ తదుపరి చిత్రం మజిల్ తిరుమేణి డైరెక్షన్ లో వస్తున్న ‘విడ ముయార్చి’. ఈ సినిమా చాలా ఆలస్యం తరువాత సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అజిత్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

  • Written By: NARESH
  • Published On:
AK63 – Ajith : ఏకే 63.. అజిత్ నెక్స్ట్ మూవీ కోసం అభిమానుల హంగామా..!!

Follow us on

AK63 – Ajith : కోలీవుడ్ లోని టాప్ హీరోలలో అజిత్ ఒకరు..తమిళ కథనాయకుడు అయినప్పటికీ తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న వారిలో ఆయన ఒకరని చెప్పుకోవచ్చు. తమిళంలోనే కాకుండా డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఫ్యాన్స్ కు కూడా చేరువయ్యారు. అంతేకాదు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా అజిత్ ఎదగడం విశేషం.

కోలీవుడ్ లో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు అజిత్. సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత అంత రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరో. ఈయన సినిమాలు దాదాపు అన్ని హిట్, బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తాయన్న సంగతి కూడా తెలిసిందే. అయితే అజిత్ తన సినిమా ఫంక్షన్స్ కి రారు.. ప్రమోషన్స్ లో పాల్గొనరు.. షూటింగ్ సమయం తరువాత సైలంట్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన ప్రతి సినిమాకు గ్యాప్ ఎక్కువ తీసుకుంటారట.. ఈ క్రమంలోనే ఒక సినిమా చేస్తే అది ఎప్పుడు చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం ఎవరూ చెప్పలేరు. అందుకే అజిత్ ఫ్యాన్స్ సినిమా అప్డేట్స్ కోసం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు.. మూవీ ప్రొడ్యూసర్స్ ను ట్యాగ్ చేసి అప్డేట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేయడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న విషయం.

తాజాగా అజిత్ తదుపరి చిత్రం మజిల్ తిరుమేణి డైరెక్షన్ లో వస్తున్న ‘విడ ముయార్చి’. ఈ సినిమా చాలా ఆలస్యం తరువాత సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అజిత్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

మూవీ గురించి ఎటువంటి విషయం బయటకు రాకపోవడంతో అయోమయానికి గురవుతున్న కొందరు అభిమానులు ఎప్పటిలాగానే సోషల్ మీడియాపై పడ్డారు. ఏకే 63 సినిమా గురించి చర్చ స్టార్ట్ చేశారు. మరోవైపు ఏకే 63 ప్రాజెక్టును డైరెక్టర్ వెట్రిమారన్ తో చేయనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. కానీ వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్, విడుదలై 2తో పాటు ధనుష్ తో ఓ చిత్రం లైనప్ లో ఉన్నాయి. ఇవే ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి. అటువంటిది అజిత్ నటించనున్న విడ ముయార్చి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో..? ఎప్పుడు పూర్తి చేస్తారో..? తెలియడం లేదు. కానీ అజిత్ అభిమానులు మాత్రం ఇప్పటినుంచో మూవీ కోసం ఎదురు చూడటం గమనార్హం.

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు