Adipurush Pre Release Event: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పోటెత్తుతున్న అభిమానులు… వేల రూపాయలు ఖర్చు పెట్టి!

తిరుపతికి వెళ్ళే రైళ్లు, బస్సులు, విమానాలు బుక్ అయిపోయాయి. తిరుపతికి వెళ్లే వాహనాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వేల రూపాయలు ఖర్చు చేసి విమాన టికెట్స్ ప్రభాస్ అభిమానులు కొనుగోలు చేస్తున్నారట. ఇది హాట్ టాపిక్ అవుతుంది. తమ హీరో కోసం ఫ్యాన్స్ ఈ రేంజ్ లో ఖర్చు చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. నేడు సాయంత్రం తిరుపతి నగరం ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ కారణంగా సందడిగా మారనుంది.

  • Written By: Shiva
  • Published On:
Adipurush Pre Release Event: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పోటెత్తుతున్న అభిమానులు… వేల రూపాయలు ఖర్చు పెట్టి!

Follow us on

Adipurush Pre Release Event: దేశంలోనే ప్రభాస్ అతిపెద్ద స్టార్ గా ఉన్నారు. ఆయన సినిమా అంటే మినిమమ్ ఐదు వందల కోట్లు ఉండాలి. ప్రభాస్ రెమ్యూనరేషన్ రూ. 150 కోట్లకు పై మాటే. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల బడ్జెట్ రెండు వేల కోట్ల వరకు ఉంటుంది. ఆయనకు ఇండియా వైడ్ అభిమానులు ఉన్నారు. వీరందరూ నేడు తిరుపతికి విచ్చేస్తున్నారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరుగుతుండగా అక్కడ సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుండి ప్రభాస్ అభిమానులు తిరుపతికి చేరుకుంటున్నారు.

తిరుపతికి వెళ్ళే రైళ్లు, బస్సులు, విమానాలు బుక్ అయిపోయాయి. తిరుపతికి వెళ్లే వాహనాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వేల రూపాయలు ఖర్చు చేసి విమాన టికెట్స్ ప్రభాస్ అభిమానులు కొనుగోలు చేస్తున్నారట. ఇది హాట్ టాపిక్ అవుతుంది. తమ హీరో కోసం ఫ్యాన్స్ ఈ రేంజ్ లో ఖర్చు చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. నేడు సాయంత్రం తిరుపతి నగరం ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ కారణంగా సందడిగా మారనుంది.

ఆదిపురుష్ మూవీ జూన్ 16న వరల్డ్ వైడ్ విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. హీరో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్ తో పాటు చిత్ర యూనిట్, కీలక పాత్రలు చేసిన నటులు పాల్గొననున్నారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇండియా వైడ్ న్యూస్ అవుతుంది. కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు.

ఆదిపురుష్ రామాయణ గాథగా తెరకెక్కింది. ప్రభాస్ రాఘవుడిగా, కృతి సనన్ జానకిగా నటిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో మొదటిసారి పురాణ పాత్ర చేశారు. ఆదిపురుష్ మూవీపై మొదట్లో విమర్శలు వినిపించాయి. ఆదిపురుష్ టీజర్ వ్యతిరేకత ఎదుర్కొంది. హిందూవాదులు రావణాసుర, హనుమంతుడు గెటప్స్ తప్పుబట్టారు. అలాగే మూవీ నిర్మాణ విలువలు నాసిరకంగా ఉన్నాయనే మాట వినిపించింది. ఆదిపురుష్ ట్రైలర్ ఆ అపోహలు పటాపంచలు చేసింది. ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల్లో రూ. 150 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు