Adipurush Movie Leaked: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు. రామాయణం మీద సినిమాలు రావడం మనకు కొత్తేమి కాదు, కానీ భారీ VFX ఎఫెక్ట్స్ మరియు తారాగణం తో ఇప్పటి వరకు అలాంటి ప్రాజెక్ట్ రాలేదు.
దానికి తోడు ఆదిపురుష్ చిత్రం కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉపయోగించబోతున్నాము అని దర్శక నిర్మాతలు చెప్పడం తో ఈ సినిమా పై జనాల్లో ఆసక్తి పెరిగింది. టీజర్ నిరాశపర్చినప్పటికీ ట్రైలర్స్ మరియు పాటలు మాత్రం అద్భుతంగా ఉండడం తో ఈ చిత్రం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు ఇండియా మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి, మొదటి రోజే 130 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇదంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమా విడుదలకు ముందే ఆన్లైన్ లో కొంతభాగం లీక్ అవ్వడం మూవీ టీం ని కంగారు పెడుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు యూట్యూబ్ లో లీక్ అయ్యాయి, ఎలా లీక్ అయ్యిందో ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు. సినిమా ఎడిటింగ్ సమయం లో కట్ చేసిన కొన్ని షాట్స్ ని మూవీ టీం కి సంబంధించిన వాళ్ళే లీక్ చేసి ఉంటారని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు.
దర్యాప్తు చేయిస్తున్నామని, లీక్ చేసిన వారిపై చాలా తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు మేకర్స్. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ ప్రివ్యూ షో కొంతమంది సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా షో వేశారు. దీనికి అద్భుతమైన రివ్యూ వచ్చింది, కచ్చితంగా ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా, ఇతర హీరోల అభిమానులకు కూడా ఈ చిత్రం తెగ నచ్చేస్తుందని, 3D వెర్షన్ అద్భుతంగా వచ్చిందని అంటున్నారు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More