Trivikram- Ram Charan: త్రివిక్రమ్, రామ్ చరణ్ కాంబో లో సినిమా ఎప్పుడో రావాల్సింది ఎందుకు ఆగిపోయిందంటే..?

త్రివిక్రమ్, రామ్ చరణ్ కాంబో లో రావాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయింది అంటే త్రివిక్రమ్ రాసిన స్టోరీ బాగున్నప్పటికీ అది రామ్ చరణ్ కి కూడా చెప్పి ఒప్పించాడు.

  • Written By: NARESH
  • Published On:
Trivikram- Ram Charan: త్రివిక్రమ్, రామ్ చరణ్ కాంబో లో సినిమా ఎప్పుడో రావాల్సింది ఎందుకు ఆగిపోయిందంటే..?

Follow us on

Trivikram- Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్…ఈయన మాటల్లో పదును కత్తి కంటే షార్ప్ గా ఉంటుంది. ఆయన వేసిన పంచ్ కొన్ని దశాబ్ధాల పాటు జనాల హృదయం లో నిలిచిపోతుంది… ఆయన చేసిన సినిమాలే ఆయన్ని తెలుగు సినిమా డైరక్టర్ల అందరి కంటే ఒక ప్రత్యేకమైన స్థానం లో నిలిచేలా చేశాయి…ఇండస్ట్రీ కి తనో టార్చ్ బేరర్… ఒక సున్నితమైన అంశానికి తమ మార్క్ ట్రీట్మెంట్ ని ఆడ్ చేసి సినిమాలు తీసి సక్సెస్ కొట్టడం లో ఆయనని మించిన డైరెక్టర్ ఇండస్ట్రీ లో లేరనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇప్పటికే తెలియజేశారు.ఇక ఇలాంటి నేపథ్యం లో ఈ సినిమా తర్వాత ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది.

ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ త్రివిక్రమ్ రామ్ చరణ్ కాంబో లో ఇప్పటికే రావాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయింది అనే ప్రశ్నల మీదనే ఇప్పుడు చాలా ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి…
కొద్ది సంవత్సరాల క్రితమే వీళ్ళ కాంబో లో సినిమా రావాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కార్య రూపం దాల్చలేదు..రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీ లో మగధీర , రంగస్థలం, త్రిబుల్ అర్ లాంటి సినిమాలతో తన నట విశ్వరూపాన్ని చూపించారు.ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చాలా రికార్డ్ లను బ్రేక్ చేసి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్నారు…

ఇక త్రివిక్రమ్, రామ్ చరణ్ కాంబో లో రావాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయింది అంటే త్రివిక్రమ్ రాసిన స్టోరీ బాగున్నప్పటికీ అది రామ్ చరణ్ కి కూడా చెప్పి ఒప్పించాడు.కానీ చివరలో త్రివిక్రమ్ కే ఆ స్టోరీ అంత బాగా అనిపించక పోవడం తో త్రివిక్రమ్ ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసి ఇది కాదు మనం ఒక మంచి స్టోరీ చేద్దాం సర్ అని రామ్ చరణ్ కి చెప్పి ఆ ప్రాజెక్ట్ ని అలా పక్కన పెట్టేసి ఇప్పుడు ఆయన కోసం ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో సినిమా చేయాలనే ఆలోచన లో త్రివిక్రమ్ ఉన్నట్టు గా తెలుస్తుంది…మరి ఈ కాంబోలో సినిమా వస్తే మాత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వడం పక్క అని అభిమానులు ఇప్పటికే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు… చూడాలి మరి వీళ్ళ కాంబో లో ఎప్పుడు సినిమా వస్తుందో…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు