ఏ స్టార్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాడంటే ?

కరోనా మహమ్మారి రెండో లాక్ డౌన్ ముగిసిన తర్వాత సినిమా వాళ్ళ ఆలోచనలు, ప్లానింగ్ లు మారిపోయాయి. దాదాపు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడంతో షూట్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” లాంటి భారీ చిత్రాలు చిత్రీకరణ కోసం డేట్లు ను కూడా షురూ చేసుకున్నాయి. అయితే తాజా అప్ డేట్ ప్రకారం మరికొన్ని భారీ చిత్రాలు కూడా సెట్స్ పైకి రావడానికి కసరత్తులు పూర్తి చేసుకున్నాయి. మరి ఆ చిత్రాల షూటింగ్ వ్యవహారాల గురించి ఆరా […]

  • Written By: Raghava
  • Published On:
ఏ స్టార్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాడంటే ?

Follow us on

కరోనా మహమ్మారి రెండో లాక్ డౌన్ ముగిసిన తర్వాత సినిమా వాళ్ళ ఆలోచనలు, ప్లానింగ్ లు మారిపోయాయి. దాదాపు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడంతో షూట్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” లాంటి భారీ చిత్రాలు చిత్రీకరణ కోసం డేట్లు ను కూడా షురూ చేసుకున్నాయి. అయితే తాజా అప్ డేట్ ప్రకారం మరికొన్ని భారీ చిత్రాలు కూడా సెట్స్ పైకి రావడానికి కసరత్తులు పూర్తి చేసుకున్నాయి. మరి ఆ చిత్రాల షూటింగ్ వ్యవహారాల గురించి ఆరా తీస్తే..

పుష్ప

పాన్ ఇండియా సినిమా చేయాలనే కోరిక కారణంగా అల్లు అర్జున్ చేస్తోన్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ను జులై 5న హైదరాబాద్ లో పునః ప్రారంభం కాబోతుందని చిత్రబృందంలోని సభ్యుల ద్వారా అందిన తాజా సమాచారం. ఎట్టిపరిస్థితుల్లో త్వరగా పుష్ప మొదటి భాగాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలని దర్శకనిర్మాతల ప్లాన్.

F3 :

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వస్తోన్న “ఎఫ్ 3” సినిమా జులై 1 నుంచి హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. ఈ షూట్ లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సునీల్ తో పాటు వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డిలు కూడా పాల్గొంటున్నారు.

ఆచార్య :

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కూడా జులై మొదటివారంలోనే మొదలు కానుంది. రామ్ చరణ్ కూడా రెండు రోజుల పాటు ఈ షూట్ లో పాల్గొంటాడని టాక్ ఉంది. అలాగే 13 రోజులు షూట్ చేస్తే.. ఇక ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టొచ్చు.

బీస్ట్ :

తమిళ స్టార్ హీరో విజయ్, క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే కలయికలో వస్తోన్న మూవీ షూటింగ్ కూడా జులై 1 నుంచి ప్రారంభం కానుంది. పైగా ఈ సినిమా షూట్ సాంగ్ తో మొదలు కానుంది. ఇప్పటికే, ఈ పాట కోసం రిహార్సల్స్ ను కూడా పూర్తి చేశారు. ఆ ఫోటోలను పూజ హెగ్డే తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి తెగ హడావిడి చేసింది. అలాగే బాలయ్య ‘అఖండ’, నాని కొత్త సినిమా, విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కూడా జులై మొదటి వారంలోనే షూట్ కి వెళ్లనున్నాయి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు