Venkatesh: ప్రముఖులతో హాజరైన పార్టీలో పగిలిన ఫోన్ తో కనిపించిన వెంకటేష్.. ఎందుకిలా కనిపించారు?

స్టార్ హీరోలు, హీరోయిన్ లు మాత్రమే కాదు కాస్త సెలబ్రిటీ హోదా వచ్చిందంటే చాలు లగ్జరీ గా ఉండాలని, షో చేయాలని చాలా మందికి ఉంటుంది. లగ్జరీ ఐటమ్స్ వాడాలని ఎక్కువగా అనుకుంటారు.

  • Written By: Neelambaram
  • Published On:
Venkatesh: ప్రముఖులతో హాజరైన పార్టీలో పగిలిన ఫోన్ తో కనిపించిన వెంకటేష్.. ఎందుకిలా కనిపించారు?

Follow us on

Venkatesh:  టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వెంకీ సినిమాలు వస్తున్నాయంటే జనాలు ఎదురుచూసేవారు. థియేటర్లలో రిలీజ్ అవడమే ఆలస్యం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకునేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెంకటేష్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ స్టేటస్ ను సంపాదించారు. చివరి సారిగా వచ్చిన ఎఫ్ 3 సినిమా కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక దృష్యం సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ లు కూడా హిట్ అయ్యాయి. ఇంతకు వెంకీ గురించి ఎందుకు అనుకుంటున్నారా? అయితే చదివేయండి..

స్టార్ హీరోలు, హీరోయిన్ లు మాత్రమే కాదు కాస్త సెలబ్రిటీ హోదా వచ్చిందంటే చాలు లగ్జరీ గా ఉండాలని, షో చేయాలని చాలా మందికి ఉంటుంది. లగ్జరీ ఐటమ్స్ వాడాలని ఎక్కువగా అనుకుంటారు. ధరించే దుస్తుల నుంచి వాడే ఫోన్ లు, పెట్టుకునే వాచ్ లు కూడా లగ్జరీగా ఉండేలా చూసుకుంటారు. మరి ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న వెంకటేష్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటారని రీసెంట్ గా వైరల్ అవుతున్న ఓ ఫోటోను చూస్తే అర్థం అవుతుంది.

Venkatesh-Nagarjuna-at-Chiranjeevi-Diwali-Bash-Balakrishna-missed1
ఈ ఫోటోలో వెంకటేష్ చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ పగిలిపోయింది. ఈ ఫోన్ నిజంగానే పగిలిందా? లేదా స్క్రీన్ గార్డ్ పై గీతలు పడ్డాయా తెలియదు. కానీ ఈ రెండింటిలో ఏది అయినా కూడా అలాంటి ఫోన్ ను వాడరు. అది కూడా ఫంక్షన్ లకు, పార్టీలకు అలాంటి ఫోన్ తో కనిపించరు. కానీ వెంకటేష్ మాత్రం అలాంటివి పట్టించుకోకుండా మరీ ఈ ఫోన్ తో ప్రత్యక్షమయ్యాడు. ఇంత సింపుల్ గా ఉండడం చూసిన నెటిజన్లు వెంకీ మామ నువ్వు గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయినా అంత సింపుల్ గా ఉండడం నీకు మాత్రమే సొంతం అంటూ కొనియాడుతున్నారు.

రామ్ చరణ్ ఇంట్లో సినీ ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో వెంకటేష్ కూడా భాగమయ్యారు. ఇక ఈ పార్టీలోనే వెంకీ ఇలా కనిపించడంతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ సినిమాలో నటిస్తుండగా శైలేష్ కొలను డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో వైల్డ్ రోల్ లో కనిపిస్తున్నారట ఈ టాలీవుడ్ హీరో. దీంతో మరో సక్సెస్ పక్కా అంటున్నారు నెటిజన్లు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు