Varuntej – Lavanya : తాళికట్టే వేళ వరుణ్ కాళ్లు మొక్కిన లావణ్య.. వైరల్ పిక్!

ఐదేళ్లకు పైగా లావణ్య, వరుణ్ రహస్య ప్రేమాయణం సాగింది. గత రెండేళ్లుగా పుకార్లు తెరపైకి వచ్చాయి. ఎట్టకేలకు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు.

  • Written By: NARESH
  • Published On:
Varuntej – Lavanya : తాళికట్టే వేళ వరుణ్ కాళ్లు మొక్కిన లావణ్య.. వైరల్ పిక్!

Follow us on

Varuntej – Lavanya : వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ ఈ వేడుకకు హాజరు కావడమే ఇందుకు కారణం. టాలీవుడ్ స్టార్ హీరోల్లో సగం మంది మెగా ఫ్యామిలీ నుండే ఉన్నారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా దున్నేస్తుంటే, రామ్ చరణ్ ఆస్కార్ వరకూ వెళ్ళాడు. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్ టాలీవుడ్ బడా హీరోలుగా ఉన్నారు. వీరందరు వరుణ్ తేజ్ వివాహంలో కొలువు దీరారు.

ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. పెళ్ళికి రెండు మూడు రోజుల ముందే ఇటలీ వెళ్లారందరూ. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ పెళ్ళిలో సందడి చేశారు. నాగబాబు కుమారుడు వివాహం కోసం భారీగా ఖర్చు చేశారని తెలుస్తుంది. వధూవరుల బట్టలు మనీష్ మల్హోత్రా డిజైన్ చేశాడు. ముంబై స్టైలిష్ట్స్ పెళ్ళికి పని చేశారు. దాదాపు రూ. 10 కోట్ల వరకు ఖర్చు అయ్యిందని అంచనా.

సోమవారం నుండి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. నవంబర్ 1 బుధవారం రాత్రి 7:18 నిమిషాలకు ముహూర్తం. ప్రేయసి లావణ్య మెడలో వరుణ్ మూడు ముళ్ళు వేశాడు. ఈ అద్భుత క్షణాన్ని కెమెరాలో బంధించారు. వరుణ్ తేజ్ తాళి కడుతుంటే… లావణ్య త్రిపాఠి ఆయన కాళ్లకు దండం పెడుతుంది. ఆమె ముఖంలో నవ్వులు విరబూశాయి. ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఫోటో అద్భుతంగా ఉందంటున్న అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక మిస్టర్ మూవీలో లావణ్య-వరుణ్ మొదటిసారి కలిసి నటించారు. అప్పుడే వీరికి స్నేహం మొదలైంది. అంతరిక్షం అనే మరో చిత్రంలో జతకట్టారు. అప్పుడు బంధం ఇంకా బలపడింది. ఐదేళ్లకు పైగా లావణ్య, వరుణ్ రహస్య ప్రేమాయణం సాగింది. గత రెండేళ్లుగా పుకార్లు తెరపైకి వచ్చాయి. ఎట్టకేలకు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు