Amitabh Bachchan- Anushka Sharma: నెటిజన్ల రోల్ మోడల్స్.. పోలీసులకు అడ్డంగా బుక్కైన అమితాబ్ , అనుష్క

ఏజ్ బార్ అయినా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. లేటేస్టుగా ఆయన ఓ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన షూటింగ్ స్పాట్ కు వెళ్లేందుకు ఓ రైడర్ బైక్ ఎక్కాడు.

  • Written By: Chai Muchhata
  • Published On:
Amitabh Bachchan- Anushka Sharma: నెటిజన్ల రోల్ మోడల్స్.. పోలీసులకు అడ్డంగా బుక్కైన అమితాబ్ , అనుష్క

Follow us on

Amitabh Bachchan- Anushka Sharma: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి వార్తల్లోకెక్కారు. సినిమాల్లోనే కాకుండా ఆన్లైన్లో నిత్యం నెటిజన్లతో కనెక్ట్ గా ఉండే ఆయన ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించారు. కొందరు దీనిని గమనించి పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరడంత వెంటనే రంగంలోకి దిగారు. ఆయనకు ఫైన్ విధించేందుకురెడీ అయ్యారు. మరోవైపు బాలీవుడ్ నటి అనుష్క సైతం ఇలాగే ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేశారు. దీంతో ఆమెపై కూడా పోలీసులు యాక్షన్ తీసుకోడవానికి రెడీ అవుతున్నారు. ఇంతకీ ఈ ఇద్దరు ఏం చేశారంటే?

ఏజ్ బార్ అయినా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. లేటేస్టుగా ఆయన ఓ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన షూటింగ్ స్పాట్ కు వెళ్లేందుకు ఓ రైడర్ బైక్ ఎక్కాడు.వెంటనే అతడు అమితాబ్ ను గమ్యానికి చేర్చారు. ఈ సందర్భంగా రైడర్ కు థ్యాంక్స్ చెబుతూ అమితాబ్ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. ఎంత ట్రాఫిక్ ఉన్నా తనకు సాయం చేసినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. అయితే ఇందులో బైక్ రైడర్ తో పాటు అమితాబ్ బచ్చన్ హెల్మెట్ పెట్టుకులేదు. దీంతోకొందరు నెటిజన్లు హెల్మెట్ వాడకపోవడంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే ముంబై పోలీసులు ఆ ట్వీట్ కు స్పందించి రీ ట్వీట్ చేశారు. హెల్మెట్ ధరించనందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

మరో చోట బాలీవుడ్ స్టార్ నటి సైతం ఓ బైక్ రైడర్ పై వెనక కూర్చుంది. ఈ సమయంలో బైక్ రైడర్ తో పాటు అనుష్క కూడా హెల్మెట్ ధరించలేదు. ముంబైలో బైక్ రైడర్ తో పాటు వెనక కూర్చున్న వారు సైతం హెల్మెట్ ధరించాలనే నిబంధన ఉంది. దీంతో అనుష్కపై చర్యలు తీసుకోవాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ ట్వీట్ పై కూడా పోలీసులు స్పందించారు. వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

హెల్మెట్ విషయంలో ఎంతటి సెలబ్రెటీలు అయినా రూల్స్ పాటించాలని పోలీసులు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు స్పందనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతీ విషయంల ఇలాంటి దూకుడు ఉంటే బాగుంటుందని కొందరు పోస్టులు పెట్టడం గమనార్హం. ఏదీ ఏమైనా ఎంతపెద్దవారికైనా చర్యలు తప్పవని సూచించడానికే పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారని మరికొందరు అంటున్నారు.

Read Today's Latest Bollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు