Murugadoss: మురుగదాస్ తో సినిమాకి నో చెప్పిన తమిళ్ స్టార్ హీరో…కారణం ఏంటంటే..?

నిజానికి ఒక మంచి మెసేజ్ ని కమర్షియల్ గా ఎలా చెప్పాలి అనేది మురుగదాస్ కి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదనే చెప్పాలి. అలాగే ఆ సినిమాలు కొన్నిసార్లు ఇండస్ట్రీ హిట్లను కూడా నమోదు చేసుకున్నాయి.

  • Written By: Gopi
  • Published On:
Murugadoss: మురుగదాస్ తో సినిమాకి నో చెప్పిన తమిళ్ స్టార్ హీరో…కారణం ఏంటంటే..?

Follow us on

Murugadoss: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సినిమాలు చేసి తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్న డైరెక్టర్ మురుగదాస్… అప్పట్లో ఈయన సినిమా వస్తుందంటే సినిమా రిలీజ్ కి ముందే మంచి హైప్ ని క్రియేట్ చేసేది. ఇక ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఒక మంచి మెసేజ్ ని ఇస్తూనే, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మిళితమై ఉండేవి.

నిజానికి ఒక మంచి మెసేజ్ ని కమర్షియల్ గా ఎలా చెప్పాలి అనేది మురుగదాస్ కి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదనే చెప్పాలి. అలాగే ఆ సినిమాలు కొన్నిసార్లు ఇండస్ట్రీ హిట్లను కూడా నమోదు చేసుకున్నాయి.ఇక తమిళ్ సూపర్ స్టార్ అయిన విజయ్ తో చాలా సినిమాలు చేశాడు.ఇక ఈయన చేసిన సినిమాలు తమిళం, తెలుగులో రిలీజ్ అయి మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి.ఇక తమిళంలో ఈయన చేసిన రమణ సినిమా సూపర్ హిట్ అయింది.దాంతో తెలుగులో చిరంజీవి ఠాగూర్ పేరుతో వినాయక్ డైరెక్షన్ లో రీమేక్ చేసి హిట్టు కొట్టాడు.

ఈయన ఒకప్పుడు మంచి హిట్ సినిమాలు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం హిట్లు లేకపోవడంతో ఏ హీరో కూడా ఆయనకు అవకాశాలు ఇవ్వడం లేదు.ఇప్పటికే విజయ్ కి తుపాకి,కత్తి, సర్కార్ లాంటి మూడు వరుస బ్లాక్ బస్టర్ సినిమాలను ఇచ్చిన విజయ్ తో ప్రస్తుతం మురుగదాస్ సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ మురుగదాస్ తో సినిమా చేయడానికి విజయ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.అందుకే మురుగదాస్ శివ కార్తికేయన్ ని హీరోగా పెట్టి ప్రస్తుతానికి ఒక సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నారు…అయితే మురగదాస్ కి ఈ పరిస్థితి రావడానికి ముఖ్య కారణం తెలుగులో మహేష్ బాబును హీరోగా పెట్టి చేసిన స్పైడర్ సినిమా…

ఈ సినిమా గోరంగా నిరాశపరిచింది అలాగే రజనీకాంత్ హీరోగా వచ్చిన దర్బార్ సినిమా కూడా భారీ డిజాస్టర్ ని ఇవ్వడం తో బ్యాక్ టూ బ్యాక్ రెండు డిజాస్టర్ల ని ఇవ్వడం తో ఏ స్టార్ హీరో కూడా మురగదాస్ కి డేట్స్ ఇవ్వడం లేదనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈయన మళ్లీ ఒకప్పటి పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలి అంటే ప్రస్తుతం ఒక సినిమా హిట్టు కొట్టి చూపించాలి.అలా చేస్తే మళ్లీ స్టార్ హీరోలు అందరూ ఆయన చుట్టూ తిరుగుతారు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు