Sudigali Sudheer: మెజిషియన్ గా జబర్ధస్త్ సుధీర్.. తొలినాళ్లలో ఎలా ఉండేవాడో తెలుసా? వైరల్ వీడియో

ప్రస్తుతం సుడిగాలి సుధీర్ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా అడుగుపెట్టి హీరోగా రాణిస్తున్నారు. గాలోడు, స్టాప్ వేర్ సుధీర్, 3 మంకీస్ ఇలా పలు చిత్రాల్లో నటించి అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.

  • Written By: Suresh
  • Published On:
Sudigali Sudheer: మెజిషియన్ గా జబర్ధస్త్ సుధీర్.. తొలినాళ్లలో ఎలా ఉండేవాడో తెలుసా? వైరల్ వీడియో

Follow us on

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్న సంగతి తెలిసిందే. యాంకర్ గా, కమెడీయన్ గా, నటుడిగానే కాకుండా మెజిషియన్ గా బుల్లితెర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. సుధీర్ గురించి ఒక్కమాటలో చెప్పుకోవాలంటే మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం సుడిగాలి సుధీర్ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా అడుగుపెట్టి హీరోగా రాణిస్తున్నారు. గాలోడు, స్టాప్ వేర్ సుధీర్, 3 మంకీస్ ఇలా పలు చిత్రాల్లో నటించి అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.. తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా యువతలో ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే సుధీర్ తన కెరీర్ ప్రారంభంలో ఎలా ఉండేవారు..? ఏం చేసేవారు? అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జబర్దస్త్ ప్రొగ్రాంలో సుధీర్ టీం లీడర్ గా ఉన్నప్పటికీ ఎక్కడా ఆ భావాన్ని చూపించే వారు కాదంట. అందరితో కలిసి కట్టుగా ఎంతో సరదాగా ఉండేవారని తెలుస్తోంది. ఒదిగి ఉండటం ఆయన మరో ప్రత్యేకత. ఈ కారణాలతోనే జనాల్లో సుధీర్ క్రేజ్ టాప్ స్థాయిలో ఉంది. అయితే ఆ పేరు సంపాదించడానికి ఆయన ఎన్నో కష్టాలను , అవమానాలను ఎదుర్కొన్నారు. ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా మొహంపై చిరునవ్వును మాత్రం ఏనాడూ కోల్పోకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించారు.

సుధీర్ మెజిషియన్ గానూ అభిమానులను ఆలరించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు చెందిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినీ హీరో ఆనంద్ వద్దకు వెళ్లిన సుధీర్ మెజిషియన్ గా తన టాలెంట్ ను ప్రదర్శించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. దీంతో సుడిగాలి సుధీర్ జీవితంలో మరింతగా ఎదగాలని అభిమానులు కోరుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు