Bobby Deol: యానిమల్’ విలన్ బాబీ డియోల్ గురించి షాకింగ్ విషయాలు..!

1995 వ సంవత్సరంలో బాలీవుడ్ లో ‘బర్ సాత్’ అనే చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు బాబీ డియోల్. సినిమా విడుదలైన తొలి రోజే సుమారు రూ.68 లక్షల వసూళ్లను రాబట్టింది. అంతేకాదు వారాంతానికి రూ.1.69 కోట్లను వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

  • Written By: Suresh
  • Published On:
Bobby Deol: యానిమల్’ విలన్ బాబీ డియోల్ గురించి షాకింగ్ విషయాలు..!

Follow us on

Bobby Deol: బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు బాబీ డియోల్.. ఈయన గురించి టాలీవుడ్ కి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాబీ డియోల్ నటనకు తెలుగులోనూ అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

1995 వ సంవత్సరంలో బాలీవుడ్ లో ‘బర్ సాత్’ అనే చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు బాబీ డియోల్. సినిమా విడుదలైన తొలి రోజే సుమారు రూ.68 లక్షల వసూళ్లను రాబట్టింది. అంతేకాదు వారాంతానికి రూ.1.69 కోట్లను వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి సినిమాతోనే పేరు సాధించిన బాబీ డియోల్ ఆ తరువాత చిత్రాలు అంతగా విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి.. బాబీ డియోల్ మొదటి సినిమా కలెక్షన్స్ కంటే అప్పుడు రిలీజ్ అయిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మూవీ డీడీఎల్జే సినిమా తక్కువ కలెక్షన్స్ సాధించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగా ఆదరించారనేది తెలిసిపోతుంది.

చాలా సమయం తరువాత సల్మాన్ ఖాన్ తో నటించిన రేస్-3 చిత్రంతో బాబీ డియోల్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ సినిమాలో విలన్ గా నటించారు.

ఇటీవల వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా చేసిన బాబీ డియోల్ చాలా కాలం తరువాత మరోసారి విజయాన్ని అందుకున్నారు. దాదాపు 28 ఏళ్ల సినీ ప్రస్థానంలో బాబీ డియోల్ 28 ఫ్లాప్స్ అందుకున్నారు. అయితే తాజాగా వచ్చిన యానిమల్ చిత్రం ఆయన రాతను మార్చేసిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఈ క్రమంలో అభిమానులు చూపిన ప్రేమాభినాలతో బాబీ డియోల్ సైతం ఫిదా అయిపోయారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు