Salaar CeaseFire Trailer : స్నేహితుడి రాజ్యం కోసం కదిలొచ్చిన ‘ప్రభాసుడు’.. టోటల్ కథ ఇదే, మైండ్ బ్లాక్

విజువల్స్ తో పాటు కథ కెజిఎఫ్ కి చాలా దగ్గరగా ఉంది. అక్కడ గోల్డ్ మైన్స్ నారాచి కోసం లోపలి శత్రువులు, బయట శత్రువులు పొంచి హస్తగతం చేసుకోవాలని చూస్తారు

  • Written By: NARESH
  • Published On:
Salaar CeaseFire Trailer : స్నేహితుడి రాజ్యం కోసం కదిలొచ్చిన ‘ప్రభాసుడు’.. టోటల్ కథ ఇదే, మైండ్ బ్లాక్

Follow us on

Salaar CeaseFire : బాహుబలి 2 అనంతరం ప్రభాస్ రేంజ్ మూవీ పడలేదు. సాహో కొంతకొంతలో పర్లేదు. రాధే శ్యామ్, ఆదిపురుష్ పూర్తిగా నిరాశపరిచాయి. ఫ్యాన్స్ హిట్ దాహంతో ఉన్నారు. ప్రభాస్ స్థాయికి తగ్గ సినిమా తీసే దర్శకుడు కావాలని ఎదురు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో మూవీ ప్రకటించారు. ఫ్యాన్ ఫుల్ ఖుషి. వారి అంచనాలు తారా స్థాయికి చేరాయి. మరి ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ కోరుకున్నట్లు ప్రభాస్ ని ప్రజెంట్ చేయగలరా అనే సందేహాలకు ట్రైలర్ తో సమాధానం చెప్పాడు.

ఎస్… సలార్ అంచనాలకు మించి ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. 3 నిమిషాల 45 సెకండ్స్ నిడివి గల ట్రైలర్ గూస్ బంప్స్ కలిగించే విజువల్స్ తో సాగింది. ప్రశాంత్ నీల్ రాజమౌళి స్టైల్ ఫాలో అయ్యాడు. ట్రైలర్ లో మొత్తం కథ చెప్పేశాడు. ఇద్దరు బాల్య మిత్రుల కథే సలార్. పృథ్వీరాజ్ కోసం ఎంతకైనా తెగించే మిత్రుడు ప్రభాస్. ఓ కారణంగా ప్రభాస్ పృథ్వీరాజ్ ని విడిచి వెళ్ళిపోతాడు. సాధారణ జీవితం గడుపుతాడు.

పృథ్వీరాజ్ ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యం మీద ఇద్దరి కన్నుపడుతుంది. తమ సైన్యాలతో అటాక్ చేస్తారు. నిస్సాహాయుడైన పృథ్విరాజ్ కి అప్పుడు ప్రభాస్ అవసరం వస్తుంది. తన సైన్యంగా ప్రభాస్ ని తెచ్చుకుంటాడు. కనిపించే మొత్తం సామ్రాజ్యం తనకు కావాలని కోరతాడు. మిత్రుడుకి మాట ఇచ్చిన ప్రభాస్… శత్రువుల మీద దండయాత్ర చేస్తాడు. మరి ప్రభాస్ రెండు బలమైన సైన్యాలను ఎలా ఎదిరించాడు. మిత్రుడు పృథ్వీరాజ్ కోరిక ఎలా నెరవేర్చాడు అనేది కథ…

విజువల్స్ తో పాటు కథ కెజిఎఫ్ కి చాలా దగ్గరగా ఉంది. అక్కడ గోల్డ్ మైన్స్ నారాచి కోసం లోపలి శత్రువులు, బయట శత్రువులు పొంచి హస్తగతం చేసుకోవాలని చూస్తారు. సలార్ కథ కూడా దాన్నే తలపిస్తుంది. సలార్ మూవీలో ఖాన్సార్ అనే ఒక ఊహాజనిత నగరాన్ని సృష్టించారు. వెయ్యి సంవత్సరాలు ఒక బందిపోటు ముఠా ఆ ప్రాంతాన్ని ఏలుతూ వస్తారు. దాని మీద శతృవులు కన్నేస్తారు.

యాక్షన్ విజువల్స్ టాప్ నాచ్ గా ఉన్నాయి. మరొక కీలక పరిమాణం ఏమిటంటే… ప్రభాస్ ఎంట్రీ సినిమాలో లేటుగా ఉండే సూచనలు కలవు. అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలవుతుందనిపిస్తుంది. ఇక పార్ట్ 2 ఉంటుందని హింట్ ఇచ్చారు. సలార్ పార్ట్ 1 అని ట్రైలర్ మెన్షన్ చేశారు. బాబీ సింహ, జగపతిబాబు కీలక రోల్స్ చేశారు. పృథ్వీరాజ్, ప్రభాస్ మధ్య సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా సలార్ మూవీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. సలార్ డిసెంబర్ 22న విడుదల కానుంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు